Home Film News రిలీజైన ‘వద్దురా సోదరా..’ మోషన్ పోస్టర్!
Film News

రిలీజైన ‘వద్దురా సోదరా..’ మోషన్ పోస్టర్!

Vaddura Sodara First Look

 

‘నా గర్ల్ ఫ్రెండ్ నేను లేకుండా సంతోషంగా ఉండలేను అని చెప్పినందుకు నేను కూడా సంతోషంగా ఉండటం మానేసాను.. సంతోషం అనే ముసుగు వేసుకుని బ్రతికేస్తున్నాను.. I am happily unhappy..’ అంటూ ఈ మధ్యనే ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది ‘వద్దురా సోదరా..’ మూవీ టీమ్. స్వేఛ్చ క్రియేషన్స్ మరియు StabFab ప్రొడక్షన్స్ ద్వారా ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రిషి హీరోగా, ధన్య బాలక్రిష్ణ జంటగా కనిపించబోతున్నారు. ఇస్లాహుద్దీన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కన్నడలో కూడా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పోస్టర్, స్టోరీ లైన్ చూస్తుంటే కాస్త కొత్తగా అనిపిస్తున్నాయి.

ఈ కన్నడ హీరో పోస్టర్ లో కుర్చీకి కట్టేసి ఉండి, చేతులకి బాక్సింగ్ గ్లౌజ్ లతో, తలపై లైట్స్ తో ఉన్న కిరీటంతో సినిమా టీమ్ ప్రేక్షకులకి ఏం చెప్పబోతుందో వేచి చూడాల్సిందే. విష్ణు ప్రసాద్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఎడిటింగ్ గురుస్వామి చేస్తుండగా, సంగీతం ప్రసన్న శివారామన్ అందిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో మహాదేవ్ ప్రసాద్, భవానీ ప్రకాష్, అపూర్వ భరద్వాజ్, నాగభూషణ నటిస్తున్నారు. KGF సినిమా తర్వాత మెల్లగా కన్నడ హీరోలు తెలుగు సినీ తెరపై కూడా ఏకకాలంలో తమ అదృష్టం పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...