Home Film News Mass Combo: నాలుగోసారి మాస్ కాంబో సెట్ అయిందిగా.. ర‌వితేజ అభిమానుల‌కి పూన‌కాలే..!
Film News

Mass Combo: నాలుగోసారి మాస్ కాంబో సెట్ అయిందిగా.. ర‌వితేజ అభిమానుల‌కి పూన‌కాలే..!

Mass Combo: సినిమా ప‌రిశ్ర‌మ‌లో కొన్ని కాంబినేష‌న్స్ లో ఎన్ని సినిమాలు వచ్చిన జ‌నాల‌కి ఏ మాత్రం బోర్ కొట్ట‌వు. అందుకు కార‌ణం వారి కాంబోలో వచ్చిన ప్ర‌తి సినిమా హిట్ కావ‌డంతో పాటు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి బాల‌య్య‌- బోయ‌పాటి కాంబో తీసుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కు వారి కాంబినేషన్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ కూడా మంచి విజ‌యం సాధించాయి. త్వ‌ర‌లో వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌చ్చిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇక టాలీవుడ్‌లో అలాంటి హిట్ కాంబినేష‌న్ ర‌వితేజ‌- గోపిచంద్ మ‌లినేని కాంబో. ఇప్పటికే వీరి కలయికలో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలు వ‌చ్చాయి. 2021లో వచ్చిన క్రాక్ సినిమా మాత్రం ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేనీల కెరియ‌ర్‌కి మంచి బూస్టింగ్ ఇచ్చింద‌నే చెప్పాలి.

క్రాక్ సినిమాకి ముందు ఇద్ద‌రు కూడా వ‌రుస ఫ్లాపులని చ‌వి చూశారు. ఆ స‌మ‌యంలో జెట్ స్పీడ్‌తో వ‌చ్చిన క్రాక్ చిత్రం మంచి మాస్ యాక్షన్ నేపథ్యంతో రూపొంది పెద్ద విజ‌యం సాధించ‌డంతో పాటు బాక్సాఫీస దగ్గ‌ర భారీ విజ‌యాన్ని కూడా అందుకుంది. ఈ ఉత్సాహంతోనే ర‌వితేజ వ‌రుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. గతేడాది ఏకంగా మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ర‌వితేజ ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’, ‘రావణసుర’ చిత్రాల‌తో అలరించారు. మరో మూడు చిత్రాలు ర‌వితేజ‌ లైనప్ లో ఉన్నాయి. ఇవి కూడా కొద్ది గ్యాప్‌లోనే విడుద‌ల కాబోతున్నాయి. అయితే ర‌వితేజ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ని మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేయ‌బోతున్నాడు. తాజాగా దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌టన వ‌చ్చింది.

ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిన మూడు చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో నాలుగో చిత్రంపై కూడా అంచ‌నాలు భారీగా ఉన్నాయి. మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా మారిన ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ విజయపథంలో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌నుంది. ఇదే బ్యానర్ లో గోపీచంద్ మ‌లినేని చివరిగా బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ కొట్టారు. ఈ సినిమా త‌ర్వాత గోపిచంద్ ఇప్పుడు ర‌వితేజ‌తో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొంద‌బోతుంద‌ని టాక్. చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డు చూడ‌ని విధంగా ర‌వితేజ‌ని ఈ చిత్రంలో చూపించ‌నున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. త్వర‌లోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని విష‌యాలు వెల్ల‌డించ‌నున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...