Home Film News Rashmika: అత్యాశ‌కి పోయిన ర‌ష్మిక‌.. ఉన్న ఛాన్స్ కూడా పోయిందిగా..!
Film News

Rashmika: అత్యాశ‌కి పోయిన ర‌ష్మిక‌.. ఉన్న ఛాన్స్ కూడా పోయిందిగా..!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్నా ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఒక‌ప్పుడు వ‌రుస అవకాశాలు ద‌క్కించుకున్న ర‌ష్మిక ఇప్పుడు అవకాశాల కోసం నానా ఇబ్బందులు ప‌డుతుంది.. ఇటీవ‌ల   నితిన్, వెంకీ కుడుములు, రష్మిక కాంబోలో రెండవ చిత్రానికి సంబంధించొ అనౌన్స్‌మెంట్ రాగా, ఈ సినిమా మంచి హిట్ అవుతుంద‌ని అంద‌రు  అనుకున్నారు.   గతంలో వీరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ కావ‌డంతో మూవీపై అనౌన్సమెంట్ వ‌చ్చిన స‌మ‌యంలోనే మంచి హైప్ వచ్చింది.  ఓ వీడియోతో అద్భుతంగా ఆ చిత్రాన్ని అనౌన్స్ చేయ‌డంతో ఈ చిత్రం డిఫ‌రెంట్ జాన‌ర్‌తో తెర‌కెక్కుతుంద‌ని అంద‌రు భావించారు.

అయితే ఇప్పుడు  ఊహించని విధంగా నితిన్, వెంకీ కుడుముల చిత్రం నుంచి తప్పుకుంది ర‌ష్మిక‌. కొద్ది రోజుల క్రితం రష్మికకి తన మాజీ మేనేజర్ కిరణ్ తో వివాదం జరగ‌గా, ఈ మూవీ నుండి త‌ప్పుకోవ‌డానికి అత‌నే కార‌ణ‌మ‌ని అంద‌రు అనుకున్నారు. అయితే మ‌రో ప్ర‌చారం ఏం జ‌రిగింది అంటే.. రష్మిక బాలీవుడ్ చిత్రాలకి ప్రధాన ఇవ్వడం వల్ల నితిన్ చిత్రం కోల్పోయింది అని అన్నారు.  రష్మికకి బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందట.  నితిన్ చిత్రానికి డేట్లు అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ మూవీని రష్మిక పక్కన పెట్టేసింది. ప్రతి హీరోయిన్ బాలీవుడ్ లో రాణించాలని ప్రయత్నిస్తుండ‌గా,  టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన చాలా మంది హీరోయిన్లలో సక్సెస్ సాధించిన వారు చాలా తక్కువ.

ప్ర‌స్తుతం రష్మిక కి కూడా బాలీవుడ్ ఏమాత్రం కలసి రావడం లేదు. ఇప్పటి వరకు రష్మికకి బాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేదు. అయినప్పటికీ షాహిద్ కపూర్ మూవీ కోసం నితిన్ మూవీ ని పక్కన పెట్టేసింది. అయితే ఆ మూవీ కూడా ఇప్పుడు అటకెక్క‌డంతో ఇప్పుడు నితిన్ సినిమా పోయింది, షాహిద్ సినిమా పోయింది. ఈ  క్ర‌మంలో అత్యాశకు పోయిన రష్మికకి భంగపాటు తప్పలేదు అంటూ నెటిజ‌న్స్ తీవ్రంగా  ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న ఒకే ఒక్క క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2 కాగా, ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...