Home Film News Tamannaah: బాహుబలి కోసం అంత కష్టపడ్డా కూడా క్రెడిట్ అంతా వారికే పోయిందంటూ తమన్నా షాకింగ్ కామెంట్స్
Film News

Tamannaah: బాహుబలి కోసం అంత కష్టపడ్డా కూడా క్రెడిట్ అంతా వారికే పోయిందంటూ తమన్నా షాకింగ్ కామెంట్స్

Tamannaah: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పీరియాడిక‌ల్ మూవీ బాహుబ‌లి. రెండు భాగాలుగా తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌ల‌కు పాకేలా చేసింది. ప్ర‌భాస్, అనుష్క‌, త‌మ‌న్నా, స‌త్య‌రాజ్,ర‌మ్య‌కృష్ణ వంటి వారు ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, ఈ సినిమాతో వారికి పాన్ ఇండియా స్టార్ డం కూడా ద‌క్కింది. అయితే బాహుబ‌లి సినిమా వ‌ల‌న  ప్రభాస్, రానా స్థాయిలో త‌న‌కు పేరు రాలేదంటుంది త‌మ‌న్న. తాజాగా త‌మ‌న్నా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ… యాక్షన్ చిత్రాలకు సంబంధించి ఇప్పటికీ మేల్ యాక్టర్స్‌కే ఎక్కువ క్రెడిట్ దక్కుతోందని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌ర‌చింది త‌మ‌న్నా.

యాక్షన్ చిత్రాల వ‌ల‌న  తమ కంటే మేల్ యాక్టర్స్ కే ఎక్కువ పేరొస్తుందని చెప్పిన త‌మ‌న్నా ఆచిత్రం వ‌ల‌న  ప్రభాస్, రానాకి పేరు రావ‌డం స‌ముచిత‌మే అని చెప్పుకొచ్చింది.బాహుబ‌లి  సినిమా ద్వారా ప్రభాస్, రానాలకు వచ్చిన పేరుకు వారు అర్హులు. అయితే  నాకు తగిన గుర్తింపు రాకపోవడానికి కార‌ణం అందులో నా పాత్ర ఓ స్థాయికి పరిమితం కావడమే అని పేర్కొంది త‌మ‌న్నా.  ఫిల్మ్ కంపానియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఇలాంటి షాకింగ్‌ కామెంట్స్ చేసింది. బాహుబలి మూవీతో ప్రభాస్ కు పాన్ ఇండియా రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమా తర్వాత అతడు చేసే చిత్రాల‌న్ని కూడా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్నాయి.. ఇప్పుడు ఆదిపురుష్ మూవీతో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

గత సంవ‌త్స‌రం ‘ఎఫ్3, గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లో కనిపించిన త‌మ‌న్నా.. ఈ మధ్య బాలీవుడ్ చిత్రాల‌పై ఫోకస్ చేసింది. అంతేకాదు బోల్డ్ పాత్రల్లో నటించేందుకు కూడా ఏ మాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’  వెబ్ సిరీస్ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇటీవ‌ల ట్రైలర్ విడుద‌ల కాగా, ఇందులో ఆమె సీన్లు చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. అంతలా బోల్డ్‌నెస్ ప్రదర్శించిన తమన్నాకు ఈ మూవీ సెట్స్‌లోనే నటుడు విజయ్ వర్మతో పరిచయం ఏర్పడి అది ప్రేమ‌గా మారింది.  ప్రస్తుతం అత‌నితో డేటింగ్‌లో ఉన్నట్లు  ఇంటర్వ్యూలో చెప్పిన త‌మ‌న్నా త్వ‌ర‌లో అతడిని పెళ్లి చేసుకోనున్న‌ట్టు సమాచారం.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...