Home Film News Anushka: అనుష్క‌కి ఐదు సార్లు పెళ్లి జ‌రిగిందా.. అస‌లు నిజం ఏంటంటే..!
Film News

Anushka: అనుష్క‌కి ఐదు సార్లు పెళ్లి జ‌రిగిందా.. అస‌లు నిజం ఏంటంటే..!

Anushka: అనుష్క శెట్టి.. ఈ అందాల భామ‌ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.. సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా..తన కెరియ‌ర్‌లో ఎన్నో మంచి పాత్ర‌లు పోషించి అల‌రించింది. ముద్దుగా ఈ అమ్మ‌డిని స్వీటీ అని పిలుచుకున్నా కూడా  వెండితెరపై మాత్రం దేవసేన, జేజమ్మ అని పిలుచుకుంటారు. ఎలాంటి పవర్ ఫుల్ రోల్ చేయాలన్నా సరే అంద‌రికి ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్క‌దే.  ప్రస్తుతం ఈమె  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా చేస్తుంది. పి మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి అనుష్క జంటగా నటిస్తున్నారు.

ప్ర‌భాస్‌తో త‌ప్ప అనుష్కపై ఇప్పటి వరకు పెద్దగా లవ్ ఎఫైర్ రూమర్స్ అనేవి రాలేదు. అయితే తాజాగా అనుష్క శెట్టి గురించి ఎవరికీ తెలియని కొన్ని విష‌యాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  గతంలో అనుష్క శెట్టిని జయప్రద ఇంటర్వ్యూ చేసిన వీడియో  ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసింది. తాను  ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఒక కుర్రాడు ప్రపోజ్ చేయ‌గా, అప్పుడు అది  ప్రేమనో, అట్రాక్షనో  తెలియ‌క‌పోయిన ఓకే చేసింద‌ట‌. ఆ త‌ర్వాత అత‌నికి దూర‌మైన కూడా ఇప్ప‌టికీ  అది ఒక మెమోరీగా నిలిచిపోతుంద‌ని పేర్కొంది..

ఆ తర్వాత  ఎంతో మంది ప్రపోజ్‌ చేసిన కూడా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పుకొచ్చింది అనుష్క‌.  ఇక అదే ఇంట‌ర్వ్యూలో కొన్ని ఫ‌న్నీ ఆన‌ర్స‌ర్స్ ఇచ్చింది. వాస్తవంగా నాకు సోషల్ మీడియా ఐదు సార్లు పెళ్లి చేసిందని చెప్పుకొచ్చింది.   మీ కెరీర్‌లో అతిపెద్ద గాసిప్‌ ఏంటనే ప్రశ్నకి స్పందించిన అనుష్క‌.. నేను ఐదు సార్లు పెళ్లి చేసుకున్నా అని పేర్కొంది. ఎవరెవరితో అని ప్రశ్నించగా, దానికి  తాను కలిసి నటించిన కోస్టార్స్   ప్రభాస్, ప్రకాశ్ కోవెల మూడి, నాగార్జున, సుమంత్, గోపీచంద్  అని  తెలియ‌జేసింది అనుష్క‌. ఇది పాత విష‌య‌మే అయిన ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.  ఇక తన సినిమాలో బాగా నచ్చే సినిమా `అరుంధతి`, `వేదం` అని చెప్పిన అనుష్క‌.. నచ్చని చిత్రం `ఒక్కమగాడు` అని  స్ప‌ష్టం చేసింది.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...