Home Special Looks మెగాస్టార్ అయ్యాక కూడా చిరంజీవి 1996 లో ఖాళీగా ఉండడానికి కారణం!
Special Looks

మెగాస్టార్ అయ్యాక కూడా చిరంజీవి 1996 లో ఖాళీగా ఉండడానికి కారణం!

The Reason Behind Megastar Leisure In 1996

అది 1976 సంవత్సరం. ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే ఒక కుర్రాడు అక్కడికి పరుగెత్తుకుని వచ్చి మరీ ఆ షూటింగ్ ని చూశాడు. సినిమా అతన్ని అంతలా ఆకర్షించింది. అది చూసిన తర్వాత ఇక సినిమా హీరో అవ్వాలి అనుకున్నాడు. ఆ వెంటనే ఆ విషయం గురించి మరింత తెలుసుకోవడం కోసం నేరుగా ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న హీరో దగ్గరికే వెళ్ళి అడిగాడు. మద్రాస్ వెళ్ళి అక్కడ నటనలో కోచింగ్ తీసుకోవాలి అని చెప్పాడు. ఆయన ఇచ్చిన సమాధానం.. ఆ కుర్రాడిలో నిజంగా హీరో అవ్వాలన్న కసి అతన్ని మెగాస్టార్ ని చేశాయి.

తన ఊరినుంచి మద్రాస్ రైలెక్కి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. నటన గురించి బాగా అధ్యయనం చేశాడు. ప్రాక్టీస్ చేశాడు. డాన్స్ కూడా నేర్చుకున్నాడు. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటివాళ్ళు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పుడు అతనికి అవకాశాలు కావాలి. వాటికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మెల్లగా అనుకున్నట్టే పునాది రాళ్ళు సినిమాలో అవకాశం సంపాదించాడు. అప్పటిదాకా వచ్చిన హీరోల కన్నా బాగా డాన్స్ చేయగలగడం, ఫైట్స్ కూడా బాగా చేయగలగడం దర్శకులకి అతనితో సినిమా చేయడానికి ఇష్టపడేలా చేసింది. ఇక అప్పటినుంచి.. అంటే 1978 నుంచి 1983 వరకు దొరికిన ప్రతి పాత్ర చేస్తూ తన నటనని నిరూపించుకుంటూ వచ్చాడు. ఈ ఐదేళ్లలోనే 60 సినిమాల దాకా చేశాడంటే మామూలు విషయం కాదు.

అంతలా శ్రమిస్తున్న చిరంజీవికి 1983 వ సంవత్సరం పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఖైదీ విడుదలైన సంవత్సరం అది. ఇక అక్కడినుంచి చిరంజీవి ఏ మాత్రం ఆగిపోలేదు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి పెద్ద పెద్ద హిట్ లతో ప్రేక్షకులని అలరించాడు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్ర బలంగా వేసుకున్న చిరంజీవికి 1994 లో ఊహించని షాక్ తగిలింది. ఎస్పి పరుశురామ్, రిక్షావోడు వంటి సినిమాలు ఫ్లాప్ అవడంతో వాటిని నిర్మించిన వాళ్ళకి భారీగా నష్టాలు వచ్చాయి.

ఈ అనుభవం నుంచి ఆయాన కొలుకోవడానికి బాగా టైమ్ తీసుకున్నారని చెప్పాలి. అందుకే ఎంచుకోవాల్సిన కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. అందుకే 1996 సంవత్సరం బాగా ఫ్రీ అయిపోయారు. ఆ సంవత్సరం ఖాళీగా ఉండి.. మరుసటి సంవత్సరం.. అంటే 1997 లో ‘హిట్లర్’ సినిమాతో మళ్ళీ పెద్ద హిట్ అందుకున్నారు. ఇక అప్పటినుంచి చిరంజీవికి ఫెయిల్యూర్స్ పెద్దగా కనిపించలేదు. అన్నీ హిట్ సినిమాలే చేస్తూ.. తన మెగాస్టార్ ఇమేజ్ ని కాపాడుకుంటూ వచ్చారు. సినిమాల వల్ల కాదు కానీ.. ఆ ఇమేజ్ రాజకీయాల లోకి వచ్చి.. పార్టీ పెట్టడం వల్ల డామేజ్ అయిందని చెప్పుకోవచ్చు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...