Home Film News Hero: ఒకింటి వారైన శ‌ర్వానంద్, వ‌రుణ్ తేజ్.. ఇప్పుడు పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మ‌రో హీరో
Film News

Hero: ఒకింటి వారైన శ‌ర్వానంద్, వ‌రుణ్ తేజ్.. ఇప్పుడు పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మ‌రో హీరో

Hero: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హంగామా న‌డుస్తుంది. యువ హీరోలు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఇటీవ‌లే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ శ‌ర్వానంద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో పెళ్లి పీట‌లెక్కాడు. వారి పెళ్లి రాజ‌స్తాన్ లో అట్ట‌హాసంగా జరిగింది. ఇక హైద‌రాబాద్ లో రిసెప్ష‌న్ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి సినీ రాజ‌కీయ ప్రముఖులు త‌ర‌లి వ‌చ్చారు. ఇక జూన్ 9న వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే. కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్న ఈ జంట ఎట్ట‌కేల‌కు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. ఏడాది చివ‌రిలో వీరిరివురు పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు మ‌రో టాలీవుడ్ హీరో కూడా పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. తన ఏజ్ హీరోలంద‌రు పెళ్లి పీట‌లెక్కుతున్న నేప‌థ్యంలో రామ్ కూడా మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. రామ్ కి త్వరలో వివాహం చేసే పనిలో కుటుంబ సభ్యులు ఉన్న‌ట్టు తెలుస్తుంది.  హైదరాబాద్ కి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో రామ్ కి  పెళ్లి సంబంధం ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.  మ‌రి ఇందులో ఎంత క్లారిటీ ఉంద‌నేది తెలియాల్సి ఉంది. గ‌తంలో కూడా రామ్ పెళ్ళికి సంబంధించి అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ రూమర్ చాలా గ‌ట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే రామ్ ఫ్యామిలీ నుంచి అఫీషియల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని చెబుతున్నారు.

రామ్ వ‌య‌స్సు ఉన్న నితిన్, నిఖిల్, రానా ఇలా  హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. వారి ఏజ్ గ్రూప్ లో ఉన్న రామ్ మాత్రం ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు. ఆయ‌న కూడా పెళ్లి చేసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నాడ‌ని , త్వ‌ర‌లోనే ఆ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని వినికిడి. ఇక  హీరో రామ్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్  బోయపాటి దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయ‌లేదు. ఇటీవల విడుదలైన టీజర్ కి  మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా త‌ర్వాత  రామ్ తనకి ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పూరి జగన్నాధ్ తో క‌లిసి ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ చిత్రం  ఉండ‌నుంద‌ని అంటున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...