Home Film News Vijaya Nirmala: విజ‌య నిర్మ‌ల మొద‌టి భ‌ర్త ఎవ‌రు.. అత‌ని నుండి ఆమె ఎందుకు విడిపోవ‌ల్సి వ‌చ్చింది..!
Film News

Vijaya Nirmala: విజ‌య నిర్మ‌ల మొద‌టి భ‌ర్త ఎవ‌రు.. అత‌ని నుండి ఆమె ఎందుకు విడిపోవ‌ల్సి వ‌చ్చింది..!

Vijaya Nirmala: గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించిన విజ‌య నిర్మ‌ల  గురించి ఎంత చెప్పిన త‌క్కువే. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా, అనేక భాష‌ల‌లో సినిమాలు తీసి అనేక అవార్డ్స్, రివార్డ్స్ దక్కించుకుంది. విజ‌య నిర్మ‌ల అందానికి మైమ‌ర‌చిపోని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. అందుకునేమో సూప‌ర్ స్టార్ కృష్ణ అప్ప‌టికే పెళ్లైన‌ప్ప‌టికీ విజ‌య నిర్మల‌ని  రెండో వివాహం చేసుకున్నాడు. అయితే  విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20వ తారీకున జ‌న్మించ‌గా, ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలుత 1950లో వెండితెర‌పై క‌నిపించింది. ఇక 2016లో శ్రీ శ్రీ అనే ఒక సినిమాలో చివరిసారిగా క‌నిపించిన విజ‌య నిర్మ‌ల‌ 2019 జూన్ 27వ తారీకున క‌న్నుమూసారు.

అయితే విజ‌య నిర్మ‌ల సినిమా లైఫ్ ప్ర‌తి ఒక్క‌రికి తెలుసు. కాని ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు. విజ‌య నిర్మ‌ల‌ కృష్ణకు రెండో భార్య కాగా, అలానే కృష్ణ కూడా విజ‌య నిర్మల‌కు రెండో భ‌ర్తే. విజ‌య నిర్మ‌ల కృష్ణ కంటే ముందు కృష్ణ‌మూర్తి అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. అత‌ను  షిప్ డిజైనింగ్ ఇంజ‌నీర్‌ గా పనిచేసేవారు. విజ‌య నిర్మ‌ల – కృష్ణ‌మూర్తి దాంప‌త్యంలో ఒక కొడుకు కూడా జన్మించారు. అత‌డు ప్ర‌ముఖ న‌టుడు న‌రేష్‌. బిడ్డ పుట్టాక కూడా కొన్ని రోజుల పాటు వీరి దాంప‌త్య జీవితం సాఫల్యంగా సాగుతూ వ‌చ్చింది. కాని  మ‌ధ్య‌లో వారిరివురికి సినిమాలకు సంబంధించి తరచూ గొడవలు అవుతూ ఉండేవ‌ట‌.

విజయనిర్మలకు స్టార్ హీరోయిన్‌గా ఎద‌గాల‌నే కోరిక బ‌లంగా ఉండ‌గా, అది కృష్ణ‌మూర్తికి ఏ మాత్రం  న‌చ్చేది కాద‌ట‌. ఆ కార‌ణంగానే వీరిద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగేవి. దీంతో వారు  విడాకులు తీసుకున్నార‌ట‌. కృష్ణమూర్తి తో విజయనిర్మలకి నరేష్ అనే కొడుకు పుట్టాడనే  అంద‌రికి తెలిసిన విష‌య‌మే .కానీ నరేష్ కాకుండా సురేష్ అనే మరో కుమారుడు వీరిద్ద‌రికి జ‌న్మించ‌గా, అత‌ను కృష్ణ‌మూర్తితో ఉన్నాడ‌ట‌. విజ‌య‌నిర్మ‌ల ఎప్పుడైతే కృష్ణ‌మూర్తి నుండి విడిపోయి న‌రేష్‌తో హైద‌రాబాద్‌కి వ‌చ్చిందో అప్ప‌టి నుండి త‌న భ‌ర్త‌తో పూర్తిగా సంబంధాలు తెంపేసుకుంద‌ట‌.

Related Articles

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...

‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’… ఈ డైలాగ్ బాల‌య్యది కాద‌ని తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌...

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...