Home Film News Suman: వెంక‌టేశ్వ‌ర స్వామిపై నాకు భ‌క్తి లేదు..సుమ‌న్ షాకింగ్ కామెంట్స్
Film News

Suman: వెంక‌టేశ్వ‌ర స్వామిపై నాకు భ‌క్తి లేదు..సుమ‌న్ షాకింగ్ కామెంట్స్

Suman: ఒక‌ప్పుడు హీరోగా ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌లో న‌టించిన సుమ‌న్ ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ లో కూడా అద‌ర‌గొడుతున్నాడు. తండ్రిగా, విల‌న్‌గా, దేవుడి పాత్ర‌ల‌లోను మెప్పిస్తున్నాడు.  శివాజీ చిత్రంలో సుమ‌న్ పోషించిన‌ విలన్ పాత్ర, అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర  ఆయ‌నకి సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చాయి అని చెప్పాలి. అయితే వెంక‌టేశ్వ‌ర స్వామి పాత్ర‌లో పూర్తిగా ఒదిగిపోయిన సుమ‌న్‌కి ఒకప్పుడు  వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉండేది కాదట. వెంకటేశ్వర స్వామిని అసలు కేర్ చేసేవాడిని కాదని సుమన్ తాజాగా ఆసక్తికర వ్యాఖలు చేశారు. రీసెంట్‌గా  సుమన్ తన స్నేహితులతో కలసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుపతికి చెందిన  నారాయణ గౌడ్ అనే తన అభిమాని  పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సుమ‌న్.   దర్శనానంతరం సుమన్‌కు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు కూడా సుమ‌న్‌కి  అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. . నాకు ఒకప్పుడు స్వామివారిపై ఏమాత్రం భక్తి ఉండేది కాదు. అయినా కూడా స్వామివారు నన్ను కరుణించారు. ఆయన పాత్రలో అన్నమయ్యలో నటించే అవకాశం ద‌క్కింది.. అప్పుడే తెలిసింది. స్వామివారి చల్లని చూపు నాపై ఉందని సుమన్  స్ప‌ష్టం చేశారు.

రాజ‌కీయాల గురించి కూడా సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఉండాలా లేక కేంద్ర రాజకీయాల్లో ఉండాలా అనేది నిర్ణయించుకోలేదు అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.. అయితే సీఎం కేసీఆర్ అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉంద‌ని ఆయ‌న తెలిపారు.ప్ర‌స్తుతం సుమ‌న్  హీరోగా ‘చెంగప్ప’ అనే తెలుగు సినిమా షూటింగ్ జరుగుతుంద‌ని అన్నాడు. ‘సిద్ధన్న గట్టు’ అనే ఫ్యాక్షన్ మూవీ కర్నూలులో జరుగుతోంద‌ని, ఇవి కాకుండా కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్న‌ట్టు సుమ‌న్ తెలియ‌జేశారు.

Related Articles

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

అలా చేయడానికి బాలయ్య రెడీ.. పవన్ ఒప్పుకుంటారా..!?

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ మనం చూస్తూనే ఉన్నాం. మరీ...

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి...