Home Film News Ram Charan: త్వ‌ర‌లో చిరంజీవి ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌.. ఎందుకంటే..!
Film News

Ram Charan: త్వ‌ర‌లో చిరంజీవి ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌.. ఎందుకంటే..!

Ram Charan: టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న జంట‌. వీరిద్దరు 11 ఏళ్ల క్రితం జూన్ 14, 2012 న అట్ట‌హాసంగా వివాహ వేడుక జరుపుకున్నారు.. వీరి పెళ్లికి సినీ, రాజకీయ ప్ర‌ముఖులు త‌ర‌లి వ‌చ్చారు. అయితే జూన్ 14కి వీరి వివాహం జ‌రిగి 11 ఏళ్లు అయింది. ఈ సంద‌ర్భంగా వారికి అనేక మంది ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్న విష‌యం తెలిసిందే. మ‌రి కొద్ది రోజుల‌లోనే కొణిదెల వారి ఇంట వారసుడో వారసురాలో రాబోతున్నారు.

అయితే ఆ బ్యూటిఫుల్ మూమెంట్ ఎప్పుడా ఎన్న‌డా అని మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులంతా చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉపాసన ప్ర‌స్తుతం గర్భవతి కావడంతో హెల్త్ పరంగా కేర్ తీసుకుంటూ చాలా జాగ్రత్తలు వహిస్తోంది. ఇక కొన్నాళ్ల క్రితం రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఓ విలాస‌వంత‌మైన ఇంటిని కొనుగోలు చేసి అందులో నివ‌సిస్తున్నారు. అయితే ఇప్పుడు వారు మ‌ళ్లీ చిరంజీవి ఇంటికి రాబోతున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. మళ్ళీ మేము అత్తయ్య, మావయ్య ఇంటికి షిఫ్ట్ కాబోతున్నాం అని చెప్పుకొచ్చింది.

 

నేను అయిన ,నా భ‌ర్త అయిన కూడా ఇలాంటి స్థాయిలో ఉన్నాం అంటే మా గ్రాండ్ పెరెంట్స్ అందించిన ప్రేమ వ‌ల్ల‌నే. ఇప్పుడు అది నా బిడ్డ‌కు కూడా ద‌క్కాలి. అందుకే అత్తయ్య, మావయ్యతో కలసి ఉండాలని చరణ్, తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఉపాసన పేర్కొంది. పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ వద్ద పెరిగితే వారిలో చాలా ఉన్నత లక్షణాలు ఏర్ప‌డ‌తాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది. స్వ‌యంకృషితో ఎదిగిన చిరంజీవి అంటే క్రమశిక్షణకు మారుపేరు అని ఇండస్ట్రీలో అంతా చెబుతూ ఉంటారు. రాంచరణ్ కి కూడా చిరు అదే క్రమశిక్షణ అలవాటు చేయ‌గా, ఇప్పుడు పుట్ట‌బోయే బిడ్డ‌కి కూడా అదే రావాల‌ని రామ్ చ‌ర‌ణ్ దంపతులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...