Home Film News Renu Desai: వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావ‌డం లేదు..నీకంత సీన్ లేదంటూ రేణూపై సెటైర్స్
Film News

Renu Desai: వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావ‌డం లేదు..నీకంత సీన్ లేదంటూ రేణూపై సెటైర్స్

Renu Desai: ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి దూర‌మైంది రేణూ దేశాయ్ . అయితే అనుకోని కార‌ణాల వ‌ల‌న ప‌వ‌న్ నుండి విడిపోయింది. ఇక అప్ప‌టి నుండి పిల్లల‌తో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ వ‌స్తుంది. ఇక సోష‌ల్ మీడియాలో తన పిల్లల ఫోటోలు, వారు చేసే సంద‌డ‌కి సంబంధించిన‌ వీడియోలు అప్ లోడ్ చేస్తూ.. నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ ఉంటుంది. మ‌రి కొన్ని సార్లు రేణూ త‌న మ‌నోభావాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా వ్య‌క్త‌ప‌రుస్తూ ఉంటుంది. ఆ స‌మ‌యంలో నెటిజ‌న్స్ కొన్ని సార్లు దారుణ‌మైన కామెంట్స్ చేస్తూ ఉంటారు.

తాజాగా రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ ఒక‌టి ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. నేను చాలా రోజుల తర్వాత నా ఇన్స్టాగ్రామ్ డాష్ బోర్డును చేయ‌గా, నన్ను ఫాలో కానీ మిలియన్ల మంది నా ప్రొఫైల్, పోస్టులను గమనిస్తూ వస్తుండ‌డం ఆశ్చర్యంగా ఉంది.. నన్ను ఫాలో కాకుండా మ‌రి ఎందుకు నా ప్రొఫైల్‌ను వాళ్లు చెక్ చేస్తున్నారో ఏమాత్రం అర్ధం కావ‌డం లేద, దాని గురించే ఆలోచిస్తున్నాను అంటూ రేణు దేశాయ్ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక రేణూ పోస్ట్‌కి నెటిజ‌న్స్ ఎలా రియాక్ట్ అవుతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొంద‌రు పాజిటివ్‌గా స్పందిస్తుంటే, మ‌రి కొంద‌రు నెగెటివ్ కామెంట్ చేస్తున్నారు.

మీకు అంత సీన్ లేదు లేండి. ఎక్కువ ఫాలోవర్స్ లేకపోయినా.. రీల్స్‌ కి ఎక్కువ సజెషన్స్ జరిగి రీచ్ అలా పెరుగుతుంది. మీ కోసమే మీ ప్రొఫైల్ ను చెక్ చేసేవాళ్ళు అంత ఎక్కువ మంది ఉండరు అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ సెటైర్లు పేల్చుతున్నారు నెటిజన్లు. మరి త‌నపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కి ధీటుగా స్పందించే రేణూ ఇప్పుడు వారికి కామెంట్స్ కి ఎలా బ‌దులిస్తుందో చూడాలి. ఇక రేణూ చాలా రోజుల త‌ర్వాత ర‌వితేజ మూవీలో న‌టించింది. ఈ సినిమాతో రేణూ క‌మ్ బ్యాక్ ఇస్తుంద‌ని అంద‌రు అనుకుంటున్నారు. ద‌ర్శ‌కురాలిగా కూడా రేణూ స‌త్తా చూపుతున్న విష‌యం తెలిసిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...