Home Film News Megastar: మీతో రొమాన్స్ అస్సలు నచ్చలేదని మెగాస్టార్ కు మొహం మీదే చెప్పిన హీరోయిన్..
Film News

Megastar: మీతో రొమాన్స్ అస్సలు నచ్చలేదని మెగాస్టార్ కు మొహం మీదే చెప్పిన హీరోయిన్..

Megastar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న క్రేజ్ తెలిసిందే. చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా మెగాస్టార్ తో సినిమా అవకాశాలు వస్తే తెగ ఆనందపడిపోతారు. కానీ చిరంజీవికి జోడిగా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ మాత్రం ఆయనతో నటించడానికి ఇష్టపడలేదట. అంతేకాదు.. ఆయనతో షాట్ లో ఉన్న టైమ్ లో షూటింగ్ నుండి బయటకు వెళ్లిపోయిందట. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తో పాటు భోజ్ పూరి లాంటి భాషల్లో కూడా నటించి ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

అయితే తెలుగులో నగ్మా, చిరంజీవితో కలిసి ఘరానా మొగుడు అనే మూవీలో యాక్ట్ చేసింది. ఈ మూవీలో నటిస్తున్నప్పుడే నగ్మా చిరంజీవిని చాలా వరకు ఇబ్బంది పెట్టిందని అప్పట్లో ఓ న్యూస్ సంచలనం రేకెత్తించింది. షూటింగ్ కు కూడా టైమ్ కి రాకుండా.. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లతో పాటు చిరంజీవిని కూడా బాగా విసిగించిందట. అదే టైమ్ లో నగ్మా, చిరంజీవికి మధ్య ఘరానా మొగుడు మూవీలో ఓ రొమాంటిక్ సీన్ ఉంటుంది. ఆ సీన్ లో ఎందుకో నగ్మాకి చాాలా డిస్టర్బెన్స్ అనిపించిందని.. ఆ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితోనే డైరెక్ట్ గా మోహం మీద చెప్పిందట.

 

మీతో రొమాన్స్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అని నగ్మా సెన్సేషనల్ కామెంట్స్ చేసిందట. ఆ మాటలకు డీప్ గా హర్ట్ అయిన మెగాస్టార్.. సినిమా షూటింగ్ మొత్తం అయ్యాక.. దర్శకనిర్మాతల దగ్గరికీ వెళ్లి.. నెక్ట్స్ ఏదైనా సినిమా కోసం వస్తే, నా సినిమాలో మాత్రం నగ్మాని హీరోయిన్ గా పెట్టొద్దు అని అన్నారట. కానీ ఆ తర్వాత నగ్మా, చిరు కాంబినేషన్ లోనే ముగ్గు మొనగాళ్లు, రిక్షావాడు, సినిమాలు వచ్చాయని సినిమా జర్నలిస్ట్ ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నగ్మా, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలవడం మరో హైలెట్ గా నిలిచింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...