Home Film News Brahmanandam: బ్ర‌హ్మానందం న‌న్ను ఎంతో టార్చ‌ర్ పెట్టారంటూ జేడీ చక్ర‌వ‌ర్తి షాకింగ్ కామెంట్స్
Film News

Brahmanandam: బ్ర‌హ్మానందం న‌న్ను ఎంతో టార్చ‌ర్ పెట్టారంటూ జేడీ చక్ర‌వ‌ర్తి షాకింగ్ కామెంట్స్

Brahmanandam: ఈ తరం వారికి జేడీ చక్ర‌వ‌ర్తి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చుకాని, అప్ప‌ట్లో మాత్రం ఆయ‌న సినిమాల‌కి మంచి ఆద‌ర‌ణ ఉండేది. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, ద‌ర్శ‌కుడిగా, విల‌న్‌గా ఇలా ప‌లు ర‌కాలుగా జేడి చ‌క్ర‌వర్తి ప్రేక్ష‌కుల‌ని మెప్పించాడు. ఇప్పుడు ఆయ‌న ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ‘దయ’ అనే పేరుతో జేడీ చ‌క్ర‌వ‌ర్తి ఓ వెబ్ సిరీస్ చేయ‌గా, ఇటీవ‌ల దీనికి సంబంధించిన ట్రైల‌ర్ విడుదలై అలరించింది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా జేడి చక్ర‌వ‌ర్తి త‌న గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నాడు. అలానే ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు విష‌యాలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జెడి చక్రవర్తి.. కమెడియన్ బ్రహ్మానందం వ‌ల‌న త‌ను టార్చ‌ర్ చూశానంటూ షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించాడు జేడి. మ‌నీ చిత్రంలో జేడీ, బ్ర‌హ్మానందం ఇద్ద‌రు క‌లిసి న‌టించ‌గా వారిద్ద‌రి పాత్ర‌ల‌కు మంచి పేర్లు వ‌చ్చ‌యి. ముఖ్యంగా ఖాన్ దాదాగా ఆయ‌న తెగ వినోదం పంచారు. ఈ సినిమాకి సీక్వెల్ గా ‘మనీ మనీ మోర్ మనీ’ అనే సినిమాను స్వయంగా జెడి చక్రవర్తి తెరకెక్కించ‌గా, ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో బ్ర‌హ్మానందం త‌న‌ని చాలా ఇబ్బంది పెట్టార‌ని జేడి అన్నారు.

 

సినిమా షూటింగ్‌కి ముందు చాలా మంది బ్ర‌హ్మానందంని తీసుకోవ‌ద్ది అన్నారు. వ్యానిటీ వ్యాన్లు అడుగుతాడు. హోటల్ నుంచి రకరకాల ఆర్డర్లు తనకే కాదు తన పక్కవాళ్లకు కూడా తీసుకుర‌మ్మంటాడు. తొమ్మిదిన్నర, పదింటికి వచ్చి, 12 గంటలకు బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడు. డైలాగ్ లేకపోతే ట్రాలీలు, స్టడీక్యామ్ షాట్లు ఉంటే చేయడు అని ఆయ‌న గురించి ఏవేవో చెప్పారు. అయితే ఆయ‌న‌కు త‌గ్గ‌ట్టు నేను ప్లాన్ చేసుకోగా, బ్ర‌హ్మానందం టైంకి వ‌చ్చేవారు. ఆయ‌న‌నే స్వ‌యంగా త‌న కాస్ట్యూమ్ తెచ్చుకునేవారు. ఆయన ఎలాగో షూటింగ్ కి లేట్ వస్తారని తెలిసి అంతకంటే ముందే మేము కొన్ని సీన్స్ షూట్ చేయాలని ప్లాన్ చేసుకుంటే తొంద‌ర‌గా వ‌చ్చి తారుమారు చేసేవారు. అలా బ్ర‌హ్మానందం వ‌ల‌న నేను చాలా టార్చ‌ర్ అనుభ‌వించాను అని జేడి అన్నారు.

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...