Home Film News Pawan Kalyan: ప‌వన్ క‌ళ్యాణ్ సినిమాకి ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారా.. ఆ సినిమా ఏంటంటే..!
Film News

Pawan Kalyan: ప‌వన్ క‌ళ్యాణ్ సినిమాకి ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారా.. ఆ సినిమా ఏంటంటే..!

Pawan Kalyan: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ర‌వితేజ ఒక‌రు అని చెప్పాలి. స్వ‌యంకృషితో ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చాడు ర‌వితేజ‌. అతని అస‌లు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. ఆయ‌న‌కి ఇండ‌స్ట్రీలో ఎవ‌రి స‌పోర్ట్ లేక‌పోయిన కూడా డైరెక్ట‌ర్ అవ్వాల‌ని ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి.. ఊహించ‌ని విధంగా న‌టుడై, ఆ త‌ర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. మ‌ధ్య‌లో కొంత గ్యాప్ తీసుకున్న ర‌వితేజ క్రాక్ చిత్రంతో రీఎంట్రీ మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ చేసిన చిత్రాల‌న్నీ కూడా దారుణంగా నిరాశ‌ప‌రిచాయి. అయితే ప్ర‌స్తుతం మాస్ రాజా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అల‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు.

టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా ఈ సినిమా అక్టోబ‌ర్ లో ఈ సినిమా విడుద‌ల కానుంది. మ‌రోవైపు ర‌వితేజ ఈగ‌ల్ అనే సినిమా చేస్తున్నాడు. కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. రానున్న రోజులలో ర‌వితేజ అభిమానుల‌కి మంచి వినోదం ద‌క్క‌నుంది. అయితే ర‌వితేజ ముందు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసిన విష‌యం తెలిసిందే. కృష్ణ వంశి , రాఘవేంద్ర రావు , ఈవీవీ సత్యనారాయణ వంటి స్టార్ డైరెక్ట‌ర్స్ ద‌గ్గ‌ర ప‌ని చేశాడు

 

అలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` మూవీకి ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాడు . ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మాణంలో ఈవీవీ డైరెక్టర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. ఈ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ డెబ్యూ మూవీ కాగా, ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన ర‌వితేజ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అనేక స‌న్నివేశాల‌ను వివ‌రించి చెప్పార‌ట‌. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఏర్ప‌డింద‌ట‌. ఇప్ప‌టికీ ఆ స్నేహం కొన‌సాగుతూ వ‌స్తుంది. ఆ మ‌ధ్య ర‌వితేజ మూవీ ఈవెంట్‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెస్ట్‌గా హాజరై సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...