Home Film News Suma: సుమ హీరోయిన్‌గా చేసిన సినిమా మీకెవ‌రికైన తెలుసా..అది హిట్టా, ఫ‌ట్టా..!
Film News

Suma: సుమ హీరోయిన్‌గా చేసిన సినిమా మీకెవ‌రికైన తెలుసా..అది హిట్టా, ఫ‌ట్టా..!

Suma: యాంక‌ర్ అయిన కూడా హీరోయిన్ క‌న్నా ఎక్కువ క్రేజ్  సంపాదించుకుంది సుమ‌. కేర‌ళ‌లో పుట్టి తెలుగులో స‌త్తా చాటుతున్న సుమ గురించి ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర విష‌యం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. గ‌ల‌గ‌ల మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా అలరిస్తున్న‌ సుమ మొదటగా యాంకర్‌గా కాకుండా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఏంటంటే కళ్యాణ ప్రాప్తిరస్తు . దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌గా, మూవీలో  వక్కంతం వంశీ హీరోగా న‌టించారు. ఇక ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్లుగా సుమ, కావ్య నటించారు.

1996లో కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రం విడుద‌ల కాగా, ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ మూవీ తర్వాత వక్కంతం వంశీ నటనవైపు కాకుండా.. రైటర్ గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నాడు. ఇక సుమ యాంక‌ర్‌గా  ఎలా దూసుకుపోతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇటీవ‌ల సుమ లీడ్ రోల్‌లో జ‌య‌మ్మ పంచాయ‌తీ అనే సినిమా రాగా, ఈ సినిమాపై ఆమె అభిమానులు చాలా అంచ‌నాలు పెట్టుకున్నారు. కాని ఆ సినిమా కూడా ఫ్యాన్స్ ని నిరాశ‌ప‌ర‌చింది. దీంతో సుమ ఇక సినిమాల‌పై పెద్ద‌గా దృష్టి పెట్ట‌కుండా యాంక‌రింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

మరోవైపు సుమ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు టాక్. అంతు చిక్కని వ్యాధితో గ‌త కొన్నాళ్లుగా సుమ‌ బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవ‌ల త‌న యూట్యూబ్ ఛానల్‌లో ఆ వ్యాధి గురించి మాట్లాడుతూ.. తను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. కీలాయిడ్ టెండెన్సీ అంటే చర్మంపై ఒక చోట గాయం అయితే ఆ గాయం రోజు రోజుకు పెద్దదిగా మారి చుట్టుపక్కల అంతా వ్యాపించి మరింత పెద్ద గా అవుతుంద‌ట‌. దీని వ‌లన సుమ చాన్నాళ్లు బాధ‌ప‌డింద‌ట‌. మేకప్ వేసుకున్న ప్రతిసారి కూడా ఈ వ్యాధి వ‌ల‌న త‌న‌కు   ఇబ్బందులు ఎదురైన‌ట్టు చెప్పుకొచ్చింది సుమ‌.  కెరీర్‌ కొత్తలో ముఖానికి మేక‌ప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి వంటి విషయాలు సరిగ్గా తెలియ‌క తన చర్మానికి డ్యామేజ్ అయింద‌ని,  తర్వాత అది తగ్గడానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసిన ఫ‌లితం రాలేద‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...