Home Film News Devil: నందమూరి హీరో డెవిల్ టీజ‌ర్ వ‌చ్చేసింది.. విశ్వ‌రూపం చూపించేశాడుగా..!
Film News

Devil: నందమూరి హీరో డెవిల్ టీజ‌ర్ వ‌చ్చేసింది.. విశ్వ‌రూపం చూపించేశాడుగా..!

Devil: నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్.. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఆయ‌న ఈ మ‌ధ్య కాలంలో చేసిన బింబిసార చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మూవీ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. ఇక బింబిసార చిత్రం అందించిన జోష్‌తో ఈ యేడాది   అమిగోస్ అంటూ ప‌ల‌క‌రించాడు. ఇందులో  మూడు వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ కొత్త‌గా ట్రై చేశాడు. కాని  అమిగోస్ చిత్రం పెద్ద‌గా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. ఓట‌మి వచ్చిన కూడా క‌ళ్యాణ్ రామ్ విభిన్న‌మైన పాత్ర‌ల‌తోనే ప్రేక్ష‌కుల‌కి అల‌రించాల‌ని అనుకుంటున్నాడు.

తాజాగా   డెవిల్ సినిమా చేస్తుండ‌గా, మ‌రి కొద్ది రోజుల‌లో ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.  డెవిల్ సినిమా క‌థ కాస్త  డిఫ‌రెంట్‌గా ఉండ‌నుండంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. భారీ పాన్ ఇండియా సినిమాగా రాబోతోన్న డెవిల్ ఓ పీరియాడిక్ స్పై థ్రిల్లర్  చిత్రాన్ని భారీ ఎత్తున విడుద‌ల చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు కంప్లీట్ అయిన‌ట్టు తెలుస్తుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం  టీజ‌ర్ రిలీజ్ చేశారు.ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. టీజ‌ర్ చూస్తుంటే .. బ్రిటిష్ నేపథ్యంలో పీరియడ్ స్పై డ్రామాగా తెరకెక్కుతోందని అర్ధ‌మ‌వుతుంది. చిత్రంలో క‌ళ్యాణ్ రామ్.. బ్రిటిష్ వారి కోసం పనిచేసే సీక్రెట్ ఏజెంట్ గా   విశ్వరూపం చూపిస్తున్నాడు.

టీజ‌ర్ లో.. మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం అదే అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్, గంభీరత్వం, యాక్షన్ సీన్స్ లో అతడి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఈ సినిమాతో క‌ళ్యాణ్ రామ్ బింబిసార‌ని మించిన హిట్ అందుకుంటాడ‌ని తెలుస్తుంది.  నవీన్ మేడారం దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో  సంయుక్త మీనన్  క‌థానాయిక‌గా నటిస్తోంది. బింబిసార తర్వాత  కళ్యాణ్ రామ్- సంయుక్త క‌లిసి న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ రోజు  కళ్యాణ్ రామ్ తన 45వ జన్మదినం సంద‌ర్భంగా టీజ‌ర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ అందించారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...