Home Film News Anchor: ఎదుటివారిని న‌వ్వించే యాంక‌ర‌మ్మ క‌న్నీరు పెట్టుకుంది.. హైప‌ర్ ఆది ఏం చేశాడంటే..!
Film News

Anchor: ఎదుటివారిని న‌వ్వించే యాంక‌ర‌మ్మ క‌న్నీరు పెట్టుకుంది.. హైప‌ర్ ఆది ఏం చేశాడంటే..!

Anchor: ఈ మ‌ధ్య టీవీ షోస్‌లో డ్రామా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఇద్ద‌రికి పెళ్లిళ్లు చేసి దానిని ఈవెంట్‌లా చిత్రీక‌రించ‌డం, లేదంటే  బ‌య‌ట పెళ్లైన వారిని తీసుకొచ్చి వారికి మ‌ళ్లీ పెళ్లి చేయ‌డం, అదీ కాదంటే ఎవరైన జీవితాల‌లో విషాద సంఘ‌ట‌నలు ఉంటే వాటిని స్టేజ్ మీద చెప్పించి అంద‌రిని ఏడిపించ‌డం చేస్తున్నారు. తాజాగా జ‌బర్ధ‌స్త్ కొత్త యాంక‌ర్ సౌమ్య రావు చాలా ఎమోష‌న‌ల్ అయిది. ర‌ష్మీ షోలో త‌న అమ్మ‌ని త‌ల‌చుకొని తాను ఏడ‌వ‌డంతో పాటు ప‌క్క వారికి కూడా ఏడుపు తెప్పించింది. వివ‌రాల‌లోకి వెళితే ర‌ష్మీ హోస్ట్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఈ ప్రోమో చూస్తే ఎప్ప‌టి మాదిరిగానే  పెళ్లి చూపులు, పెళ్లిళ్లకి సంబంధించిన స్కిట్ చేసి న‌వ్వించారు.

ఇక  సౌమ్య రావు కోసం ఓ గిఫ్ట్ తెచ్చానని చెప్పి హైప‌ర్ ఆది ఆమెకి సర్ ప్రైజ్ గా గిఫ్ట్ ఇచ్చారు. ఫ‌స్ట్ ఆ గిఫ్ట్ ఏంట‌ని చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలైంది. కాని చూశాక మాత్రం చాలా ఎమోష‌న‌ల్ అయింది. త‌న త‌ల్లి  ఫోటో ఫ్రేమ్ చూసి అమ్మని తలచుకుని  వెక్కి వెక్కి ఏడ్చింది సౌమ్య రావు.  మరోవైపు ఆసుపత్రిలో అమ్మ ఉన్న సమయంలో తీసిన వీడియోని కూడా షోలో  ప్ర‌సారం చేశారు. ఇది చూసి మ‌రింత ఎమోష‌న‌ల్ అయింది సౌమ్య రావు. త‌న తల్లి ప‌డ్డ ఆవేద‌న గురించి సౌమ్య రావు తెలియ‌జేస్తూ.. అమ్మ‌కి ఎక్కువ‌గా త‌ల‌నొప్పి వ‌స్తుంటే ఆసుప‌త్రికి తీసుకెళ్లే  బ్రెయిన్‌ క్యాన్సర్‌ అని చెప్పారు. ఆ సమయంలో అమ్మ నన్ను కూడా గుర్తు ప‌ట్ట‌లేని స్థితికి వెళ్లింది.

దాదాపు మూడున్న‌ర ఏళ్ల పాటు అమ్మ బెడ్ పైనే ఉంది. అమ్మ‌డికి ఇలాంటి పరిస్థితి వ‌స్తుంద‌ని నేను ఊహించ‌లేదు. దేవుడు త‌న త‌ల్లికి అలాంటి దారుణ‌మైన ప‌రిస్థితి తీసుకురావ‌డం త‌ల‌చుకొని బోరున విల‌పించింది సౌమ్య రావు. త‌న‌క త‌ల్లి నా క‌డుపులో పుట్టాల‌ని కోరుకుంటున్నా అని చెప్పి క‌న్నీళ్లు పెట్టుకుంది సౌమ్య రావు. ఆమె ప‌రిస్థితి చూసి ఇంద్రజ‌, ర‌ష్మీతో పాటు మిగ‌తా ఆర్టిస్ట్ లు సైతం ఫుల్ ఎమోష‌న‌ల్ అయ్యారు.  దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఆదివారం ప్ర‌సారం కానుంది. ఇక సౌమ్య రావు మొద‌ట్లో సీరియ‌ల్స్‌లో న‌టించేది. జ‌బ‌ర్ధ‌స్త్‌తో ఆమెకు మరింత క్రేజ్ ద‌క్కింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...