Home Film News Sitara: సితార‌.. మిస్ యూనివ‌ర్స్ పోటీల‌కి వెళుతుందా.. షాక్‌లో ఫ్యాన్స్
Film News

Sitara: సితార‌.. మిస్ యూనివ‌ర్స్ పోటీల‌కి వెళుతుందా.. షాక్‌లో ఫ్యాన్స్

Sitara: మ‌హేష్ బాబు, న‌మ్రత‌ల ముద్దులు కూతురు సితార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక్క సినిమా చేయ‌క‌పోయిన కూడా స్టార్ హీరోయిన్‌ని మించిన క్రేజ్ దక్కించుకుంది. చిన్న వ‌య‌స్సులోనే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆక‌ర్షించింది. ఇక ఇటీవ‌ల ఇంటర్నేష‌న‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారింది. చిన్నవ‌యస్సులోనే  అతిపెద్ద యాడ్ కాంట్రాక్‌పై సైన్ చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా నిలిచింది సితార‌.   ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పీఎంజీ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సితార ఉండ‌గా, ఇటీవ‌ల  న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్  క‌నిపించాయి. ఇది చూసి మ‌హేష్‌, న‌మ్ర‌త‌లు ఫుల్ ఖుష్ అయ్యారు.

అయితే ఆ యాడ్ కోసం  సితార ఏకంగా కోటి రూపాయ‌ల రెమ్యున‌రేషన్ తీసుకున్న‌ట్టు వార్తలు వ‌చ్చాయి. చిన్న వ‌య‌స్సులోనే సితార అంత ఎద‌గ‌డం చూసి అభిమనులు, ఆమె కుటుంబ స‌భ్యులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.అయితే సితార  త్వ‌ర‌లో మ‌రో ఊహించ‌ని షాక్ ఇవ్వ‌బోతుంద‌ని అంటున్నారు. త‌న త‌ల్లి సూచ‌న‌ల‌తో సితార  ..‘మిస్ యూనివర్స్’, ‘మిస్ వరల్డ్’ పోటీలకు సిద్ధం అవుతుంద‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. దీనిపై స్పందించిన ఘ‌ట్ట‌మ‌నేని కాంపౌండ్.. త‌న‌కు ఆ పోటోల్లో పాల్గొనేందుకు ఇంకాస్తా సమయం పడుతుందని, పోటీల్లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హతలు సితార సాధించాల్సి  ఉందని  చెప్పుకొచ్చారు.

ఇక సితార సోష‌ల్ మీడియాలో  ఎంత ర‌చ్చ‌చేస్తుందో మ‌నంద‌రికి తెలిసిందే.  ఇప్ప‌టికే ఈ క్యూట్ డాల్ డాన్స్, యాక్టింగ్ సిల్స్ లో శిక్షణ తీసుకుంటుంది. అప్పుడ‌ప్పుడు  తన డాన్స్ రీల్స్ తో, క్యూట్ ఫొటోషూట్లతో  అల‌రిస్తూ ఉంటుంది.  చూస్తుంటే ఆమె త్వ‌ర‌లో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. సితార జోరు చూస్తుంటే ఆమె తండ్రిని మించిన కూతురు అవుతుందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సితార ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే  12లక్షలకు పైగానే ఫాలోవర్స్‌ ఉన్నారు. అంతేకాదు  డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సితార  సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నిర్వహిస్తోంది. అప్పుడప్పుడు ఇందులో ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...