Home Film News Sai Dharam Tej: మేనేజ‌ర్ చెంప చెళ్లుమ‌నిపించిన సాయిధ‌ర‌మ్ తేజ్.. అంత కోపానికి కార‌ణం ఏంటి?
Film NewsGossips

Sai Dharam Tej: మేనేజ‌ర్ చెంప చెళ్లుమ‌నిపించిన సాయిధ‌ర‌మ్ తేజ్.. అంత కోపానికి కార‌ణం ఏంటి?

Sai Dharam Tej: టాలీవుడ్ యువ హీరో,మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రీసెంట్ గా విరూపాక్ష అనే సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. చాలా గ్యాప్ త‌ర్వాత చేసిన ఈ సినిమాకి వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. విమ‌ర్శ‌కులు కూడా ఈ మూవీపై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌స్తుతం త‌న మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి స‌ముద్ర ఖని ద‌ర్శ‌క‌త్వంలో బ్రో అనే సినిమా చేస్తున్నారు సాయి ధ‌ర‌మ్ తేజ్. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు.

బ్రో చిత్రంలో పవన్ ‘టైమ్’ (దేవుడు) అనే క్యారెక్టర్ పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవ‌ల ప‌వ‌న్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇక కొద్ది రోజుల క్రితం సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఫస్ట్ లుక్‌తో పాటు ఈ చిత్రంలో తన క్యారెక్టర్ పేరును కూడా రివీల్ చేశారు. మార్కండేయులు@మార్క్’గా సాయిధ‌ర‌మ్ తేజ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. గ‌త కొద్ది రోజులుగా శ‌ర‌వేగంగా ఈమూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్‌కి సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా, షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో తేజ్‌కి త‌న మేనేజ‌ర్‌తో పెద్ద గొడ‌వ జ‌రిగింద‌ట‌. తనపై గౌరవం లేకుండా ప్రవర్తించినందుకు తేజ్ చాలా ఆవేశానికి లోనై మేనేజ‌ర్‌పై చేయి కూడా చేసుకున్నాడ‌ని చెబుతున్నారు.

 

‘బ్రో ది అవతార్’ కి సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ కూడా సతీష్ దగ్గరుండి చూసుకుంటుండ‌గా, ఇప్పుడు ఆయ‌న ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డంతో టీజ‌ర్ కూడా వాయిదా ప‌డింద‌ని ఫిలిం న‌గ‌ర్ టాక్. అస‌లు ఎప్పుడు సైలెంట్‌గా కూల్‌గా ఉండే సాయిధ‌ర‌మ్ తేజ్ అలా ప్ర‌వ‌ర్తించాడంటే ఎవ‌రు న‌మ్మ‌లేక‌పోతున్నారు. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌ని కొట్టి పారేస్తున్నారు. మ‌రోవైపు తేజ్ మేనేజ‌ర్ స‌తీష్‌ది కూడా మంచి వ్య‌క్తిత్వం అని అంటున్నారు. తేజ్ కోసం అహ‌ర్నిశ‌లూ ఆయ‌న శ్ర‌మించాడ‌ని, సాయితేజ్‌కి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగినప్పుడు, త‌ను ఆసుప‌త్రి లో ఉన్న‌ప్పుడు కూడా కంటికి రెప్ప‌లా కాపాడుకొన్నాడ‌ని టాక్.

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...