Home Film News Trisha: ఆయ‌న‌తో త్రిష‌కి పెళ్లి చేయ‌డం న‌చ్చ‌లేదు… అలా చేయ‌క‌పోయింటే బాగుండేద‌న్న ద‌ర్శ‌కుడు
Film News

Trisha: ఆయ‌న‌తో త్రిష‌కి పెళ్లి చేయ‌డం న‌చ్చ‌లేదు… అలా చేయ‌క‌పోయింటే బాగుండేద‌న్న ద‌ర్శ‌కుడు

Trisha: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ త్రిష‌. ఈ అమ్మ‌డు తెలుగు, తమిళం భాష‌లలో సూప‌ర్ హిట్ చిత్రాలు చేసింది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోల‌తో కూడా క‌లిసి ప‌ని చేసింది త్రిష‌. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ త‌న ఖాతాలో మ‌రో హిట్ వేసుకుంది.అయితే త్రిష‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ జయంత్ సీ పరాన్జీ తీన్‌మార్ అనే చిత్రం తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. దశాబ్ద కాలం క్రితం భారీ అంచ‌నాల‌తో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఎంత‌లా అంటే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది.

అయితే ఈ మూవీ ఫ్లాప్ గురించి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు జ‌యంత్ సి ప‌రాన్జీ. తాను దర్శకత్వం వహించిన సినిమాలు హిట్స్, ప్లాప్స్ కావడంపై మాట్లాడుతూ.. తీన్ మార్ సినిమా ఫెయిల్ కావడంపై కొన్నికీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తీన్ మార్ చిత్రంకి సంబంధించిన‌ రిజల్ట్ పక్కన పెడితే ఈ మూవీ స్టోరీ మాత్రం నాకు ఇప్ప‌టికీ కూడా ఒక ఫ్రెష్ లవ్ స్టోరీగానే అనిపిస్తూ ఉంటుంది. ఈ మూవీ ఫ్లాప్ కావ‌డానికి కార‌ణాలు ప్ర‌త్యేకంగా నేను చెప్ప‌లేను. నేను అనుకున్న దాని ప్ర‌కారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కి అది స‌రిపోలేదేమో. దాని వ‌ల్ల‌నే ప‌వ‌న్ ఫ్యాన్స్ నిరాశ‌కు గుర‌య్యార‌ని అనుకుంటాను.

 

మరీ ముఖ్యంగా చిత్రంలో త్రిషకు సోనూసూద్ తో పెళ్లి చేయడం… ఆ తర్వాత ఆమె తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు రావడం వంటి సన్నివేశాలు వాళ్లు జీర్ణించుకోలేకపోయి ఉండ‌వ‌చ్చు అని ఆయ‌న అన్నారు. ఒకవేళ ఇదే చిత్రాన్ని అప్పుడున్న యువ హీరోల్లో ఎవరో ఒకరితో క‌నుక తీసి ఉంటే మాత్రం ఫ‌లితం మ‌రోలా ఉండి ఉండ‌వ‌చ్చు అని జ‌యంత్ త‌న అభిప్రాయం తెలియ‌జేశారు. ఇక తీన్‌మార్ సినిమా విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్క‌గా ఇందులో త్రిష, కృతి కర్బంద కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన లవ్ ఆజ్ కల్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించార‌. సినిమా ఫ్లాప్ అయిన కూడా మ్యూజిక్ పరంగా శ్రోతలను ఆకట్టుకుంది.

 

Related Articles

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...