Home Film News Vedam Movie: వేదంలో క‌ర్పూరం పాత్ర‌కి ఫిదా అయిన స్టార్ డైరెక్ట‌ర్.. అత‌నే ఆ పాత్ర చేయాల‌ని అనుకున్నాడా..!
Film News

Vedam Movie: వేదంలో క‌ర్పూరం పాత్ర‌కి ఫిదా అయిన స్టార్ డైరెక్ట‌ర్.. అత‌నే ఆ పాత్ర చేయాల‌ని అనుకున్నాడా..!

Vedam Movie: కొన్ని సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యాలు సాధించ‌క‌పోయిన కూడా ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో అలా నిలిచిపోతాయి. కొన్ని పాత్ర‌లు కూడా మైండ్‌లో అలా ఫిక్స్ అయిపోతాయి. అలా ప్రేక్షకుల మ‌దిలో చెర‌గ‌ని స్థానం సంపాదించుకున్న చిత్రాల‌లో వేదం చిత్రం కూడా ఒక‌టి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో  అల్లు అర్జున్, మ‌నోజ్ లు హీరోలుగా న‌టించ‌గా అనుష్క ముఖ్య‌మైన పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసింది. దీక్షా సేత క‌థానాయిక‌గా న‌టించింది. అయితే అప్ప‌టికే  స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న స‌మ‌యంలో అనుష్క  ఈ చిత్రంలో వేశ్య‌ పాత్ర‌లో క‌నిపించి అందర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. అనుష్క న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు మంత్ర ముగ్ధులు అయ్యారు. అంద‌రు కూడా త‌మ పాత్ర‌ల‌కి ప్రాణం పోసారు అనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో అంద‌రి మైండ్‌లో రిజిస్ట‌ర్ అయిన‌ పాత్ర క‌ర్పూరం. ఎప్పుడూ అనుష్క ప‌క్క‌నే ఉండే హిజ్రా క‌ర్పూరం పాత్ర  ప్ర‌తి ఒక్క‌రికి మంచి వినోదం పంచింది.   బ్ర‌హ్మానందంతో క‌ర్పూరం చేసిన కామెడీని  ప్రేక్ష‌కులు ఫుల్ ఎంజాయ్ చేశారు. అలానే క‌ర్పూరం కాల్పుల్లో గాయ‌ప‌డినప్పుడు ఉండే ఎమోష‌నల్ సన్నివేశం  ప్ర‌తి ఒక్క‌రికి క‌న్నీళ్లు పెట్టించింది..ఈ పాత్ర‌లో ఎవ‌రు న‌టించారు అనే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌దు. అస‌లు ఈ పాత్ర‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. క్రిష్ త‌ల్లి ఆ పాత్ర చేయ‌వ‌ద్దని హెచ్చ‌రించ‌డంతో వెన‌క్కి త‌గ్గాడు.

అయితే క‌ర్పూరం పాత్ర చేసింది మ‌రెవ‌రో కాదు అనుష్క మేక‌ప్ ఆర్టిస్ట్ నిక్కి. ఓ సారి  అనుష్క  నిక్కి ఫోటోల‌ను క్రిష్ కు చూపించింది. అంతేకాదు క‌జ్ రారే పాట‌కు నిక్కి చేసిన డ్యాన్స్ వీడియోను కూడా ఆయ‌న‌కి చూపించ‌డంతో ఈ పాత్ర‌కి స‌రిగ్గా సూట‌వుతాడ‌ని భావించిన క్రిష్ క‌ర్పూరం పాత్ర‌కి నిక్కిని ఫైన‌ల్ చేశాడు. అలా క‌ర్పూరం పాత్ర‌లో  నిక్కి ఒదిగిపోయి మంచి పేరు
ప్ర‌ఖ్యాత‌లు పొందాడు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...