Home Film News Adipurush Pre-release Event: క‌నివినీ ఎరుగ‌ని రీతిలో ప్లాన్ చేస్తున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎంత ఖ‌ర్చు చేస్తున్నారంటే..!
Film News

Adipurush Pre-release Event: క‌నివినీ ఎరుగ‌ని రీతిలో ప్లాన్ చేస్తున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎంత ఖ‌ర్చు చేస్తున్నారంటే..!

Adipurush Pre-release Event: బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న న‌టించిన ఆదిపురుష్‌పై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. జూన్ 16న ఈ సినిమాని  భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మొద‌ట టీజ‌ర్‌కి నెగెటివ్ టాక్ వ‌చ్చిన త‌ర్వాత విడుద‌లైన ట్రైల‌ర్ మాత్రం భారీ అంచ‌నాలే పెంచింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ సీత పాత్ర‌లో నటించింది. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుద‌ల‌కి ప్లాన్ చేస్తున్నారు.

చిత్రంలో బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఉండ‌డంతో పాటు   ప్రభాస్‌కి నార్త్ ఇండియాలో చాలా మంది అభిమానులు ఉన్న నేప‌థ్యంలో సినిమాకి యావ‌రేజ్ టాక్ వ‌చ్చిన కూడా భారీగా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని అంటున్నారు. చిత్రంలో రావణుడిగా సైఫ్ అలీఖాన్, ఆంజనేయుడిగా దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. రామాయణం ఆధారంగాఈ చిత్రాన్ని ఓం రౌత్ తెర‌కెక్కించాడు.  ఇప్పటికే రామాయ‌ణం నేప‌థ్యంలో చాలా సీరియల్స్, సినిమాలు వచ్చాయి. అయితే ఓం రావత్ సినిమా ఎలా తీశాడని  అనే దానిపై అంద‌రిలో భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి.

ఇక మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ స్పీడ్ వేగ‌వంతం చేశారు.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 6న తిరుపతిలో భారీ ఎత్తున జ‌ర‌ప‌బోతున్న‌ట్టు ఇన్‌సైడ్ టాక్.  ఇప్ప‌టికే ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి  ప్రీ రిలీజ్ ఈవెంట్  పనులు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇక ఇండియన్ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ జరుగుని రేంజ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జ‌ర‌పాల‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌.  జై శ్రీరామ్ అనే శబ్దం వచ్చేలా బాణసంచాను పేల్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నార‌ట‌. ఇక ఈ ఈవెంట్‌కి   దాదాపు యాభై లక్షలకు పైగా ఖర్చు చేయనున్నారని అంటున్నారు.  ముంబై నుంచి రెండొందల డ్యాన్సర్లు, రెండొందల సింగర్లు ఈవెంట్ కోసం ప్ర‌త్యేకంగా రాబోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను జీఎస్టీతో కలిసి రూ.185 కోట్లకు కొనుగోలు  చేశార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...