Home Film News Anupama Engagement: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న అనుప‌మ‌.. వ‌రుడు ఎవ‌రంటే..!
Film News

Anupama Engagement: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకున్న అనుప‌మ‌.. వ‌రుడు ఎవ‌రంటే..!

Anupama Engagement: మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అయిన అనుప‌మ ఎప్పటిక‌ప్పుడు సినిమాలు, సోష‌ల్ మీడియాతో సంద‌డి చేస్తూ ఉంటుంది. అ..ఆ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లి కాలంలో వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అనుప‌మ న‌టించిన  కార్తీకేయ 2  చిత్రం ఇటీవ‌ల విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది.ఈ సినిమాతో పాన్ ఇండియా అప్పీల్ సొంతం చేసుకున్న అనుప‌మ‌.. కార్తీకేయ 2 సినిమాతో స్టార్ స్టేటస్‌ను పెంచుకొని విభిన్నమైన పాత్రలతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మైంది.

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోలతో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌యత్నం చేస్తుంది. ధనుష్‌తో కలిసి కోడి, అథర్వతో కలిసి తల్లి పొగాతే, అలానే  కీర్తీ సురేష్, జయం రవి కాంబినేషన్‌లో వస్తున్న సైరన్ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది. తెలుగు, మ‌ల‌యాళంలో వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ  లేపుతూ ఉంటుంది.

అనుప‌మ రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. నా ఎంగేజ్‌మెంట్ అయిందని.. చేతికి కంకణం కట్టుకొని ఉన్న ఒక  ఫోటో షేర్ చేసింది. దానికి నవ్వుతూ ఉన్న ఎమోజీని  కూడా పెట్టింది. ఇది చూసిన ఆమె అభిమానులు నిజమేనా అంటూ పోస్టు కింద కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అలాగే కొందరు శ్రేయోభిలాషులు అయితే ఆమెకి  కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. అయితే అనుపమ చేసిన  ఈ  సరదా సంఘటన ఇప్పుడు  సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అయ్యింది. ఇదంతా స‌ర‌దా ఎంగేజ్మెంట్ అని తెలుసుకొని కొంద‌రు ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతున్నారు. ఏది ఏమైన అనుప‌మ పిక్స్ అయితే నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే అనుపమ నిజంగా పెళ్లి చేసుకుంటే మాత్రం సగం మంది కుర్రాళ్ల గుండెలు పగిలిపోవ‌డం ఖాయం. ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాతోనే అనుపమ హాట్ టాపిక్ అవుతుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...