Home Film News Ashu Reddy: అషు రెడ్డి డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కుందా.. అత‌నితో వంద‌ల కాల్స్..!
Film News

Ashu Reddy: అషు రెడ్డి డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కుందా.. అత‌నితో వంద‌ల కాల్స్..!

Ashu Reddy: టాలీవుడ్‌ని డ్ర‌గ్స్ మాఫియా కుదిపేస్తుంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్రముఖులు డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కొని ఈడీ విచార‌ణ‌కి కూడా హాజ‌ర‌య్యారు. ఇప్పుడు అషూరెడ్డి డ్ర‌గ్స్ కేసులో ఇరుక్కున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్ది రోజుల క్రితం క‌బాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. అత‌న‌ని విచారించ‌గా ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.   పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుమారులకు కూడా ఆయ‌న  డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో కేపీ చౌదరి చెప్పినట్లు స‌మాచారం. మ‌రోవైపు  కేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ను పోలీసులు డీకోడ్ చేయ‌గా,ఇందులో  బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

ఫోన్‌లో కేపీ రెడ్డితో అషు వంద‌ల సార్లు మాట్లాడిన‌ట్టు తెలుస్తుంది. ఈ అమ్మ‌డితో పాటు టాలీవుడ్ లో ప‌లు ఐటెం సాంగ్స్ చేసిన ఓ న‌టితో పాటు 12 మంది పేర్లు కేపీ రెడ్డి బ‌య‌ట‌పెట్టిన‌ట్టు టాక్. అయితే కేసు విచార‌ణ‌లో భాగంగా అషూ రెడ్డితో పాటు మిగ‌తా వారికి కూడా నోటీసులు జారీ చేసి వారిని విచారించే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది.  అయితే పోలీసుల ఆధీనంలో ఉన్న కేపీ చౌదరి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ… తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని.. అయితే, సెలబ్రిటీలు ఎవరికీ తాను డ్రగ్స్ ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఫోన్ లిస్ట్ లో నెంబ‌రు ఉన్నంత మాత్రాన వారికి డ్ర‌గ్స్ అమ్మిన‌ట్టు కాదు క‌దా అని ఆయ‌న అన్నారు.  అయితే అషు రెడ్డిపై వ‌స్తున్న త‌ప్పుడు వార్త‌ల‌పై ఆమె స్పందించింది. కొన్ని మీడియా వ‌ర్గాలు చెబుతున్న‌ట్టు త‌న‌కు ఎవ‌రితో సంబంధం లేద‌ని ఆమె చెప్పుకొచ్చింది. ప్ర‌చ‌రాలు జ‌రుగుతున్న వాటిలో వాస్త‌వాలు లేవ‌ని, అవ‌స‌రం అయితే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు సంబంధిత వ్య‌క్తుల‌కి వాస్త‌వం చెప్పుకొస్తానంటూ అషూ రెడ్డి పేర్కొంది. అయితే త‌న అనుమ‌తి లేకుండా నెంబ‌ర్‌ని బ‌హిరంగంగా ప్ర‌ద‌ర్శిస్తే అస్స‌లు ఊరుకునేది లేద‌ని ఆమె హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మ‌రి నిజ‌నిజాలు ఏంట‌న్న‌ది మ‌రి కొద్ది రోజుల‌లో అయితే తెలియ‌నుంది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...