Home Film News Neha Chowdary: భ‌ర్త‌ని ద్వేషిస్తున్నానంటూ అంత ఓపెన్‌గా చెప్పేసిందేంటి.. బిగ్ బాస్ భామ అస‌హ‌నానికి కార‌ణం?
Film News

Neha Chowdary: భ‌ర్త‌ని ద్వేషిస్తున్నానంటూ అంత ఓపెన్‌గా చెప్పేసిందేంటి.. బిగ్ బాస్ భామ అస‌హ‌నానికి కార‌ణం?

Neha Chowdary: ఇటీవ‌ల సెల‌బ్రిటీల వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌డం లేదు. చిన్న చిన్న కార‌ణాల‌కే విడాకుల వ‌ర‌కు వెళ్లిపోతున్నారు. స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల త‌ర్వాత చాలా మంది సినీ ప్ర‌ముఖులు విడాకుల బాట పట్టారు. రీసెంట్‌గా నిహారిక కూడా  త‌న భ‌ర్త‌కి విడాకులు ఇచ్చిన‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే పెళ్లైన రెండేళ్ల‌కే ఇలా వీరిద్ద‌రు విడిపోవ‌డం మెగా ఫ్యాన్స్ కి ఆందోళ‌న క‌లిగించింది. ఇక తాజాగా  యాంక‌ర్‌, డ్యాన్సర్, యోగా ట్రైనర్, మోడల్, జిమ్నాస్ట్ అయిన నేహా చౌద‌రి త‌న భ‌ర్త‌ని ద్వేషిస్తున్నానంటూ ఓ పోస్ట్ పెట్టే సరికి అంద‌రు షాక్ అయ్యారు.ఈ అమ్మ‌డు కూడా త‌న భ‌ర్త నుండి విడిపోతుందా ఏంటి అని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చదివిన‌ నేహా చౌదరి… కొంతకాలం పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసిన ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టింది. ఇక పలు ఛానెళ్లలో యాంకరింగ్ చేసిన ఈ భామ 2020-21లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు స్టార్ స్పోర్ట్స్తెలుగులో యాంకర్గా చేసి చాలా పాపులర్ అయింది. ఆ త‌ర్వాత ప‌లు మ్యాచ్‌ల‌కి కూడా హోస్ట్‌గా చేసింది. ఇక బిగ్ బాస్ సీజ‌న్‌6లో పాల్గొన్న నేహా తెలుగు ప్రేక్ష‌కల‌కి చాలా ద‌గ్గ‌రైంది.  తాను ఇంజ‌నీరింగ్ చేస్తున్న స‌మ‌యంలో అనీల్ అనే వ్య‌క్తిలో ప్రేమ‌లో ప‌డ్డ  ఈ భామ ఇటీవ‌ల ప్రేమ వివాహం చేసుకుంది.అనంత‌రం జ‌ర్మ‌నీ వెళ్లిన ఈ భామ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌ని ప‌ల‌క‌రిస్తూ ఉంటుంది.

తాజాగా ఈ పొడుగు కాళ్ల సుంద‌రి త‌న‌కి పెళ్లి అయ్యి ఆరు నెలలు అయిందో లేదో అప్పుడే భర్తను ద్వేషిస్తున్నానంటూ ఓ పోస్టు పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది.నిన్ను నేను చాలా ద్వేవిస్తాను. అలానే ప్ర‌పంచంలో అంద‌రిక‌న్నా నిన్నే ఎక్కువ‌గా ప్రేమిస్తా. నువ్వు ఎంత పెద్దగా గురక పెట్టినా, నన్ను కారు నడపనివ్వకపోయినా, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్, కేక్స్ వంటివి కొనివ్వకుండా నువ్వు ఒక్క‌డివే తినేసిన‌.. నేను చెప్పిన ఏ పని చేయ‌క‌పోయిన ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు ఆ ప‌ని చేయ‌న‌ని చెప్పి, మ‌ళ్లీ అవే త‌ప్పులు చేస్తుంటావు. అయిన‌ప్ప‌టికీ నిన్ను చాలా చాలా ప్రేమిస్తుంటాను. అందుకు కార‌ణం నువ్వు న‌న్ను ప్రేమించే విధానం. దానికి నేను ప‌డిపోయానంటూ నేహా కామెంట్ చేసింది. ఇది చూసి ఆమె త‌న భ‌ర్త‌ని తిడుతుందో, పొగుడుతుందో కూడా అర్ధం కావ‌డం లేద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...