Home Film News Mega Family Inter Caste: మెగా ఫ్యామిలీ మొత్తం కులాంతర వివాహాలేనా.. ఏకంగా ఇన్ని పెళ్లిళ్లా?
Film News

Mega Family Inter Caste: మెగా ఫ్యామిలీ మొత్తం కులాంతర వివాహాలేనా.. ఏకంగా ఇన్ని పెళ్లిళ్లా?

Mega Family Inter Caste: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు కులాంతర వివాహాలు చాలా కామన్. మరి టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ ఇమేజ్ ఉంది. ఈ ఫ్యామిలీ నుండే సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణ తేజ్.. ఇలా వీరంతా స్టార్స్ అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఈ మెగా హీరోల పెళ్లిళ్ల విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లు జరిగింది ఈ మెగా ఫ్యామిలీలోనే అని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. చిరంజీవి, నాగబాబు కాకుండా మిగతా వారంతా మెగా ఫ్యామిలీలో కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్లే.. మరి ఆ డీటైల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి తల్లిదండ్రులది కులాంతర వివాహం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందినితో ప్రేమవివాహం చేసుకున్నారు. 2008 లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. నెక్ట్స్ బ్రాహ్మణ అమ్మాయి రేణూ దేశాయ్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చి రష్యా నటి అన్నా లెజినోవాను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ ను కులాంతర వివాహమే చేసుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని.. 2016లో శ్రీజ, కళ్యాణ్ దేవ్‌తో పెళ్లి జరిపించారు. అయితే ఇది కూడా కులాంతర వివాహామే కావడం గమనార్హం. ప్రజంట్ వీళ్లిద్దరికీ మళ్లీ విభేదాలు రావడం విడాకులకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇది కూడా కులాంతర వివాహం. ప్రజంట్ అల్లు అర్జున్ కు ఇద్దరు పిల్లలు. నెక్ట్ మెగా వారసుడు రామ్ చరణ్ పెళ్లి కూడా కులాంతర వివాహం. రీసెంట్ గా వీరికి ఆడబిడ్డ జన్మించింది. ఈ పాపకు క్లీంకారా అని నామకరణం చేశారు.

త‌ర్వాత మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికది కూడా ప్రేమ వివాహమే. చైతన్య జొన్నలగడ్డ, నిహారిక ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో నిహారిక, చైతన్య పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిది కూడా ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్. అలా పవన్ కళ్యాణ్ నుండి వరుణ్ తేజ్ వరకు దాదాపు అందరిదీ కులాంతర వివాహాలే జరగడం ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...