Home Film News Prabhas: ఆదిపురుష్ ప్ర‌మోష‌న్స్‌లో క‌నిపించ‌ని ప్ర‌భాస్.. సినిమా ఎక్క‌డ చూడ‌బోతున్నాడు..!
Film News

Prabhas: ఆదిపురుష్ ప్ర‌మోష‌న్స్‌లో క‌నిపించ‌ని ప్ర‌భాస్.. సినిమా ఎక్క‌డ చూడ‌బోతున్నాడు..!

Prabhas: మ‌రి కొద్ది గంట‌ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆదిపురుష్ చిత్రంపై ప్రేక్షకుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్ర‌భాస్, కృతి స‌నన్‌, స‌న్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓం రౌత్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవ‌ల తిరుప‌తిలో భారీ ఎత్తున చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంతో చిత్రానికి భారీ ఎత్తున హైప్ వ‌చ్చింది. సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న రేపు విడుద‌ల కాబోతుంది. ఇప్పటికే విడుద‌లైన‌ ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ మరియు ట్రైలర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి.

నార్త్ ఇండియా మొత్తం రెండు మూడు రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నిన్న‌ ప్రారంభం అయ్యింది. ఇక రెస్పాన్స్ అయితే ఓ రేంజ్ లో ఉంది, అసలు ఆన్ లైన్ లో టికెట్స్ ఎప్పుడు పెడుతున్నారో, అవి ఎప్పుడు అమ్ముడుపోతున్నాయో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. నిమిషాల వ్యవధి లోనే అన్ని షోస్ హౌస్ ఫుల్స్ అయిపోతున్నాయి.ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకి అన్నీ వెర్షన్స్ కి కలిపి 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని దాటేసినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ బుకింగ్స్ హ‌వా చూస్తూ ఉంటే, కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేస్తుందని చెప్పుకొస్తున్నారు ట్రేడ్ పండితులు.

అయితే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ త‌ర్వాత ప్రభాస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తాడని అంద‌రు అనుకున్నారు. కాని ఏ ఒక్క చోట క‌న‌ప‌డ‌లేదు. మూవీకి వ‌చ్చిన భారీ హైప్ చూసి ఇక అవ‌స‌రం లేద‌ని అనుకొని ఉంటారు మేక‌ర్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ త‌ర్వాత ప్రభాస్ యూఎస్ వెళ్లిపోయాడని అంటున్నారు. ఈ సినిమాను ఆయన అక్కడే చూస్తాడని కూడా కొంద‌రు చెబుతున్నారు. ఈ సినిమా బుకింగ్స్ అయితే రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటే మాత్రం ఈ చిత్రం అనేక రికార్డుల‌ని తిర‌గ‌రాస్తుంది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...