Home Film News Mahesh Babu: ఆ కాలేజ్‌లో మ‌హేష్ బాబుకి సీటు ఇవ్వ‌మ‌ని చెప్పారా.. కారణం ఏంటంటే..?
Film News

Mahesh Babu: ఆ కాలేజ్‌లో మ‌హేష్ బాబుకి సీటు ఇవ్వ‌మ‌ని చెప్పారా.. కారణం ఏంటంటే..?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రు. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మ‌హేష్ బాబు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు. ఆయ‌న సినిమాలు చేస్తూనే మరోవైపు ప‌లు బిజినెస్‌లు చేస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. మ‌రోవైపు సోష‌ల్ స‌ర్వీస్ కూడా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమితం కాగా, రాజ‌మౌళి సినిమాతో ఆయ‌న‌కి దేశ వ్యాప్తంగా క్రేజ్ ద‌క్క‌డం ఖాయం. ప్ర‌స్తుతం గుంటూరు కారం అనే సినిమాతో బిజీగా ఉన్న మ‌హేష్ బాబు..త్వ‌ర‌లో రాజ‌మౌళితో క‌లిసి భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు. అడ్వెంచ‌ర‌స్ మూవీగా ఈ చిత్రం ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

ఇక ఇదిలా ఉంటే మ‌హేష్ బాబుకి సంబంధించి ఇప్పుడు ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మ‌హేష్ బాబు తాను చ‌దువుకునే రోజులో త‌న‌కి ఇష్ట‌మైన కాలేజ్‌లో ఆయ‌నకి సీటు ఇవ్వ‌మ‌ని చెప్పార‌ట‌. దాంతో ప‌ట్టుబ‌ట్టి చ‌దివి మ‌ళ్లీ ఆ కాలేజ్‌లో  సీటు ద‌క్కించుకున్నాడు. వివ‌రాలోకి వెళితే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు  బాల నటుడుగా ఎన్నో సినిమాల్లో చేశారు. తండ్రి నటించిన చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించిన మ‌హేష్..  తనకు తెలియకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. సెలవులు ఉన్నప్పుడు సినిమాల్లో చేస్తూ మాములు స‌మ‌యంలో చ‌దువుకుంటూ అటు సినిమాల్లో ఇటు చదువులో రెండింటిలో సక్సెస్ అయ్యారు మ‌హేష్ బాబు.

మహేష్ బాబు పదవ తరగతి చదువుతున్న స‌మ‌యంలో ఆయ‌న ఎక్కువ‌గా  సినిమాలపై దృష్టి పెట్ట‌డంతో  ఆయనకు తక్కువ మార్కులు వచ్చాయట. అయితే త‌న‌కి మార్కులు త‌క్క‌వ రావ‌డంతో  ఎంతో ఇష్టమైన లయోలా కాలేజీలో సీటు సంపాదించలేకపోయాడు మహేష్ బాబు. దాంతో గ‌ట్టిగా చ‌ద‌వి తిరిగి  లయోలా డిగ్రీ కాలేజ్ లో సీట్ పొందారు. మొత్తానికి తాను అనుకున్న‌ది సాధించాడు సూప‌ర్ స్టార్.. చ‌దువు పూర్త‌య్యాక సినిమాల‌పై దృష్టి సారించిన మ‌హేష్‌.. రాజ‌కుమారుడు సినిమాతో హీరోగా వెండితెర ఆరంగేట్రం చేశాడు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...