Home Film News Anushka: స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఉన్న అనుష్క‌.. ఇక సినిమాలు చేయ‌దంట‌..!
Film News

Anushka: స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఉన్న అనుష్క‌.. ఇక సినిమాలు చేయ‌దంట‌..!

Anushka: సూప‌ర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క త‌న కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించింది. కేవ‌లం హీరోయిన్‌గా కాకుండా న‌ట‌నా ప్రాధాన్య‌మున్న చిత్రాలు చేసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లోను న‌టించి అద‌ర‌గొట్టింది. బాహుబ‌లి సినిమాలో దేవ‌సేన అనే పాత్ర‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది అనుష్క‌. ఈ సినిమాతో అనుష్క‌కి నేష‌న‌ల్ స్టార్‌డ‌మ్ కూడా ద‌క్కింది. అయితే బాహుబ‌లి త‌ర్వాత అనుష్క సినిమాల స్పీడ్ త‌గ్గించింది. మూడేళ్ల క్రితం అనుష్క నిశ్శ‌బ్ధం అనే చిత్రం చేయ‌గా, ఇప్పుడు   ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ అనే చిత్రంతో అల‌రించేందుకు సిద్ధ‌మైంది.. మూడేళ్ల తర్వాత అనుష్క‌ కమ్‍బ్యాక్ చిత్రం కావ‌డంతో ఈమూవీపై ఫ్యాన్స్ చాలానే అంచ‌నాలు పెట్టుకున్నారు.

న‌వీన్ పాలిశెట్టి, అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 4వ తేదీన విడుదల చేస్తామని గతంలో చిత్ర బృందం ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కాని నేప‌థ్యంలో  సినిమా విడుదల వాయిదా పడనుందని తెలుస్తోంది.అతి త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించనున్నారు. అయితే ఇదే అనుష్క‌కి చివ‌రి సినిమా అని, ఈ మూవీ త‌ర్వాత అనుష్క ఇక సినిమాలు చేయ‌ద‌ని తాజాగా కొత్త ప్ర‌చారం ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అనుష్క‌కి ప్ర‌స్తుతం అవ‌కాశాలు కూడా ఏమి రావ‌డం లేదు. అలాంటి స‌మ‌యంలో వాటి కోసం పాకులాట ఎందుక‌ని సినిమాల‌కి గుడ్ బై చెప్పాల‌ని అనుకుంటుంద‌ట‌.

మ‌రి సినిమాలు మానేసి అనుష్క పెళ్లి పీట‌లెక్కుతుందేమోన‌ని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. ఇప్ప‌టికే అనుష్క‌..ప్ర‌భాస్‌ల ప్రేమాయ‌ణం గురించి ఎన్ని వార్త‌లు వచ్చాయో మ‌నం చూశాం. వాటిని వీరిద్ద‌రు ఖండించారు. ఆ త‌ర్వాత ప‌లువురు వ్యాపార‌వేత్త‌ల‌తో అనుష్క పెళ్లి అంటూ ప్ర‌చారాలు సాగాయి. అవి కూడా పుకార్లుగానే మిగిలాయి. మ‌రి ఈ అమ్మడు నిజంగానే సినిమాలు మానేస్తుందా, ఒక‌వేళ మానేస్తే పెళ్లి చేసుకుంటుందా అనే దానిపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది. కాగా, అనుష్క‌ జీవితాన్ని తలకిందులు చేసిన చిత్రం  సైజ్ జీరో. ఈ చిత్రం కోసం  అనుష్క బాగా  వెయిట్ పెరిగింది.  ఆ బ‌రువు త‌గ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. తగ్గలేకపోయింది. దాంతో కెరీర్ డీలా ప‌డింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...