Home Film News Pawan: చిరంజీవి స‌తీమ‌ణిపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఆమె చేసిన ద్రోహం ఏంటో చెప్పిన ప‌వర్ స్టార్
Film News

Pawan: చిరంజీవి స‌తీమ‌ణిపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఆమె చేసిన ద్రోహం ఏంటో చెప్పిన ప‌వర్ స్టార్

Pawan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏ విష‌యాన్నైన కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడ‌తారు. రాజ‌కీయాల‌లోకి వెళ్లాక ప‌వ‌న్‌కి ముక్కు సూటిత‌నం మ‌రింత ఎక్కువైంది. చాలా రోజుల త‌ర్వాత ప‌వన్ క‌ళ్యాణ్ ఓ సినిమా వేడుక‌లో క‌నిపించి సంద‌డి చేశారు. పొలిటికిల్ స్పీచ్ మాదిరిగానే సుదీర్ఘ‌మైన స్పీచ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యారు. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బ్రో అనే చిత్రం తెర‌కెక్క‌గా, ఈ మూవీ జూలై 28న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో గ‌త రాత్రి శిల్ప‌క‌ళా వేదిక‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకు ఏర్పాటుచేశారు. ఈవెంట్ లో ప‌వ‌న్ .. తన వదిన సురేఖపై సంచలన వ్యాఖ్యలు చేయ‌డం విశేషం.

మొద‌టి నుండి త‌న‌కు సినిమాల ప‌ట్ల ఆస‌క్తి లేద‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇలా సినిమాల‌లోకి వ‌స్తాన‌ని ఎప్పుడు అనుకోలేద‌ని అన్నాడు.   చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నాని అనుకున్నాను. ఓ సారి అన్నయ చిరంజీవి మెగాస్టార్‌గా ఇమేజ్‌ పొంది పీక్‌లో ఉన్నప్పుడు హీరో అవుతావా? అంటే భయమేసింది. తాను చేయగలనా అనిపించింది.  కానీ మనల్ని నమ్మేవ్యక్తులు కూడా కొంద‌రు ఉంటారు. వారు మ‌న‌కి అవ‌స‌రం. మా వదిన సురేఖ నన్ను నమ్మి సినిమాలు చేయమని ప్రోత్సహించింది. అయితే షూటింగ్‌లో భాగంగా  ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్‌ ఎక్కి డాన్సు చేయమన్నారు. అప్పుడు అంద‌రి ముందు డాన్సు చేయడానికి సిగ్గుతో నేను చచ్చిపోయాను.

ఆ రోజే మా వ‌దిన‌కి ఫోన్‌ చేసి  అడిగాను. నన్ను ఎందుకు ఇలా చేశార‌ని వ‌దిన‌ని నిలదీశాను. ఆ రోజు . ఆమె చేసిన తప్పు వ‌ల్ల‌నే  ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. దీనంతటికి కారణం మా వదిన చేసిన ద్రోహమే అని ఆస‌క్తిక‌రంగా, ఫన్నీగా కామెంట్స్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.  ఇలాంటి జీవితం తాను కోరుకోలేద‌ని,  ఏదో చిన్న జీవితాన్ని గడపాలనుకున్నా, కానీ కోట్లాది మంది అభిమానులను పొందడం తన అదృష్టమని ప‌వ‌న్ చెప్పారు.. మీరు చూపించే  అభిమానానికి థ్యాంక్స్ అని మాటల్లో చెప్పలేనని అన్న ప‌వ‌న్… తనకు మాటలు చెప్పడం రాదని, సమాజం పరంగా ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు .

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...