Home Film News Bro Pre-Release: బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కేర‌ళ పిల్ల అందాల ర‌చ్చ‌.. అక్క‌డే క‌టింగ్ చేసి ష్రీ షో
Film News

Bro Pre-Release: బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కేర‌ళ పిల్ల అందాల ర‌చ్చ‌.. అక్క‌డే క‌టింగ్ చేసి ష్రీ షో

Bro Pre-Release: క‌న్నుగోటుతో కోట్లాది మంది మ‌న‌సులు కొల్ల‌గొట్టిన కేర‌ళ బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ‘ఒరు అదార్ లవ్’ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డికి ఈ చిత్రం పెద్ద‌గా క‌లిసి రాలేదు. అయితే ఈ మూవీ  బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఆ చిత్రంలోని కన్ను గీటు సీన్ ప్రియా ప్ర‌కాశ్ కు  మాత్రం చాలా పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ గ్లామ‌ర‌స్ బ్యూటీ త‌న‌ అందంతో ఆకట్టుకోవడమే కాకుండా.. మెస్మరైజ్‌ చేసే యాక్టింగ్‌ స్టైల్ తో  కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. సోషల్‌మీడియాలో  చురుకుగా ఉంటూ లేలేత అందాల‌తో  నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. ఇటీవ‌ల విదేశీ టూర్ వేసిన ప్రియా ప్ర‌కాశ్ బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగులో కూడా ప‌లు సినిమాలు చేసిన ఈ అమ్మ‌డికి అదృష్టం క‌లిసి రాలేదు. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన బ్రో అనే సినిమాలో న‌టించింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం జులై 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుండ‌గా, ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకుంది. అయితే గ‌త రాత్రి జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజ‌రైన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్.. వైట్ శారీలో నిండైన చందమామలా వెలుగులు విర‌జిమ్మింది. ఇక ప్రియా జాకెట్‌ అయితే నెక్స్ట్ లెవల్ హాట్ నెస్ అనే చెప్పాలి.  కటింగ్ బ్లౌజ్ లో ఎద పరువాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది.

ప్రియా ప్ర‌కాశ్ స్ట‌న్నింగ్ లుక్స్ చూసి కుర్ర‌కారు ఫిదా అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊర్వశి రౌటేలా, కేతిక శర్మ వంటి అందాల భామ‌లు హాజ‌రైన కూడా అంద‌రి దృష్టి ప్రియా ప్ర‌కాశ్‌పైనే ప‌డింది. త‌న క్యూట్ లుక్స్ తో అంద‌రి చూపుల‌ని త‌న వైపుకు తిప్పుకుంది.  చిత్రంలో కేతిక క‌థానాయిక‌గా న‌టించిన‌ట్టు తెలుస్తుండ‌గా, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక త‌న కెరీర్‌లో బ్రో టైమ్ బెస్ట్ టైమ్ గా చెప్పుకొచ్చింది ప్రియా. అలానే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్, అయన చుట్టూ ఉండే ఒరా గురించి  కూడా వివరించింది .  ప్ర‌స్తుతం మాత్రం  ప్రియా వారియర్ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌ అయ్యారు. ఆమె ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...