Home Film News Prabhudeva: 50 ఏళ్ల వ‌యస్సులో తండ్రి అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్ర‌భుదేవా
Film News

Prabhudeva: 50 ఏళ్ల వ‌యస్సులో తండ్రి అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్ర‌భుదేవా

Prabhudeva: ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ఇత‌ర భాష‌ల ప్రేక్ష‌కుల‌ని కూడా ప్ర‌భుదేవా ఎంత‌గానో అల‌రించాడు. కేవ‌లం డ్యాన్స్‌తోనే కాక న‌ట‌న‌తోను, డైరెక్ష‌న్ తో కూడా అల‌రించాడు. ప్ర‌భుదేవా  తన తండ్రి సుందరం, సోదరుడు రాజు సుందరంతో కలిసి ఇండియన్ సినిమా డాన్స్ ట్రెండ్ ను స‌రికొత్త మార్గంలోకి తీస‌కెళ్లాడు.ద‌ర్శ‌కుడు శంకర్ తీసిన ప్రేమికుడు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ గా మారి  ఆ తర్వాత వరుసగా పలు విజయాలు అందుకున్నాడు ప్రభుదేవా. ఒక‌వైపు  న‌టుడిగా, కొరియోగ్రాఫర్ గా రాణిస్తూనే, ద‌ర్శ‌కుడిగా కూడా ప్ర‌యోగం చేసి స‌క్సెస్ అయ్యాడు ప్ర‌భుదేవా.

హిందీ, తెలుగులో  ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు తెర‌కెక్కించాడు. అయితే  ప్రభుదేవా  త‌న సహ-డ్యాన్సర్ అయిన రమలత్‌తో ప్రేమలో పడి 1995లో  వివాహం చేసుకున్నాడు. వారి వైవాహిక జీవితంలో ఈ  దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో విశాల్ దేవ 2008లో మరణించాడు. ఇక‌ ప్రభుదేవా, రమలత్ 2011లో అనుకోని కార‌ణాల వ‌ల‌న  విడాకులు తీసుకున్నారు. అనంత‌రం  ప్రభు దేవా  హిమానీ సింగ్అనే  ఫిజియో థెరపిస్ట్ ని2020లో వివాహం చేసుకున్నాడు. కొవిడ్ సమయంలో ప్రైవేట్ సెర్మనీగా  వారి పెళ్లి జ‌రిగింది. వెన్ను నొప్పికి చికిత్స కోసం ఆమె దగ్గరకు వెళ్లిన స‌మ‌యంలో  హిమానీతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.

ఇప్పుడు హిమానీ  కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ విష‌యం ప్ర‌భుదేవా స్వ‌యంగా వెల్ల‌డించారు. 50ఏళ్ల వ‌య‌స్సులో  నేను మరోసారి తండ్రిని అయ్యాను. ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన వ్యక్తిని అన్న‌ ఫీలింగ్ కలుగుతోంది” అని ప్రభు దేవా  స్ప‌ష్టం చేశారు. ప్రభు దేవా కుటుంబంలో తొలి పాప కావడంతో వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక ప్ర‌స్తుతం త‌న‌పై ఉన్న ప‌ని భారాన్ని త‌గ్గించుకున్న‌ట్టు తెలిపారు ప్ర‌భుదేవా. ఫ్యామిలీ, కూతురుతో కలిసి ఎక్కువ సమయం గడపాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇన్నాళ్లూ త‌న‌కు పరుగెత్తడమే సరిపోయిందని, ఇక పనికి బ్రేక్ ఇచ్చి కుటుంబంతో  ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతాన‌ని అంటున్నాడు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...