Home Film News Manchu Manoj Couple: వారికి ఫ్రీగా ఆదిపురుష్ సినిమా చూపిస్తామంటున్న మంచు మ‌నోజ్ దంప‌తులు..!
Film News

Manchu Manoj Couple: వారికి ఫ్రీగా ఆదిపురుష్ సినిమా చూపిస్తామంటున్న మంచు మ‌నోజ్ దంప‌తులు..!

Manchu Manoj Couple: రామాయ‌ణం ఇతిహాసం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఆదిపురుష్ చిత్రం కోసం యావ‌త్ దేశం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. జూన్ 16న విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం ఇప్ప‌టికే భారీగా బుకింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్న నేప‌థ్యంలో అందరిలో ఆస‌క్తి నెలకొంది. చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని నిరుపేద‌ల‌కి, అనాథ‌ల‌కి ప్ర‌త్యేకంగా చూపించాల‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే  సినిమా టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రత్యేక షోలు వేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కార్తీకేయ2 నిర్మాత  అభిషేక్ అగర్వాల్ ఇప్ప‌టికే  10వేల టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ సైతం 10 వేల టిక్కెట్లు పేదల కోసం తీసుకుంటున్నట్టు స్ప‌ష్టం చేశారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలోని పాపుల‌ర్ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ  అయిన శ్రేయాస్ మీడియా  ఖమ్మం జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు అందజేస్తున్నట్టు ప్రకటించింది. ఇక తాజాగా మంచు మ‌నోజ్ దంపతులు కూడా పేద‌లకి   ఈ సినిమాని చూపించేందుకు ముందుకు వ‌చ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు అనాథ శరణాలయాల్లో నివ‌సిస్తున్న‌ 2500 పిల్లలకు ‘ఆదిపురుష్’ సినిమాను ఉచితంగా చూపించేందుకు మనోజ్, మౌనిక దంపతులు ఏర్పాట్లు చేస్తున్నారు

రెండు ప్రైవేటు సంస్థలతో వీరు చేతులు కలిపి ఈ మంచి కార్య‌క్ర‌మం చేయ‌బోతున్నారు.  బృహస్పతి టెక్, నమస్తే వరల్డ్ సంస్థలతో మేం చేతులు కలుపుతున్నాం అని మంచు మ‌నోజ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అంతేకాదు  జై శ్రీరామ్ అనే పవిత్ర శ్లోకం అన్నిచోట్లా ప్రతిధ్వనించాలి అంటూ మ‌నోజ్ తెలియ‌జేశారు. మనోజ్ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఆయ‌న అభిమానుల‌కి ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తుంది. రానున్న రోజుల‌లో కూడా ఇలాంటి మంచి ప‌నులు ఎన్నో చేయాల‌ని వారు సూచిస్తున్నారు. ఇక కొంద‌రు ఫ్యాన్స్ అయితే మనోజ్  అన్న‌..‘నిన్న చూసి మేం ఎప్పుడూ గర్వపడతాం అన్న’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...