Home Film News Project K:ఫ‌స్ట్ లుక్ నిరాశ‌ప‌ర‌చిన ప్రాజెక్ట్ కె గ్లింప్స్ అదిరింది.. టైటిల్ అర్ధం ఏంటంటే..!
Film News

Project K:ఫ‌స్ట్ లుక్ నిరాశ‌ప‌ర‌చిన ప్రాజెక్ట్ కె గ్లింప్స్ అదిరింది.. టైటిల్ అర్ధం ఏంటంటే..!

Project K: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుండి ఫ్యాన్స్ ఓ మంచి హిట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఇప్పుడు అభిమానులు స‌లార్, ప్రాజెక్ట్ కె చిత్రాల‌పైనే భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కెలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ కీలక పాత్రలో, క‌మ‌ల్ హాస‌న్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇంత మంది స్టార్ న‌టులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డంలో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి.

అయితే ప్రాజెక్ట్ కె గ్లింప్స్ కోసం అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూశారు. ఈ క్ర‌మంలో కొద్ది సేప‌టి క్రితం టైటిల్ రివీల్ చేయ‌డంతో పాటు గ్లింప్స్ విడుద‌ల చేశారు. ‘కల్కి 2898 ఏడీ అనే టైటిల్ ఫిక్స్ చేసిన మేక‌ర్స్ అద్భుతమైన విజువల్స్‌తో హాలీవుడ్ సినిమాను తలపించేలా గ్లింప్స్ వ‌దిలారు. ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.ఈ గ్లింప్స్‌లో ప్రతి సీన్ ఎంతో ఆకట్టుకునేలా, ఉత్కంఠభ‌రితంగా ఉంది. కొన్ని సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రభాస్ లుక్స్, ఎంట్రీ అద‌ర‌హో అనేలా ఉంది. దీపికా పదుకొనే పాత్ర కూడా ఆస‌క్తిని పెంచేలా ఉంది. గ్లింప్స్ లో వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అంటూ డైలాగ్ రావడం.. ఆ తర్వాత సినిమా టైటిల్ కల్కీ 2898 ఏడీ అని పేర్కొంటూ గ్లింప్స్ ముగుస్తుంది.

 

మొత్తానికి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ కాస్త నిరాశ‌ప‌ర‌చిన కూడా ఈ గ్లింప్స్ సినీ ప్రపంచాన్ని కొత్త అనుభూతినిచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి. 2024 సంక్రాంతికి నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ తెచ్చే ఆలోచ‌న చేస్తున్నాడు.వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంద‌ని అంటున్నారు. రెండు పార్ట్‌లుగా సినిమాని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అమెరికాలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్ కె రికార్డ్ సాధించింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...