Home Uncategorized రానా ఇమేజ్‌ను పెంచే మూవీ భీమ్లానాయ‌క్‌.. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌
Uncategorized

రానా ఇమేజ్‌ను పెంచే మూవీ భీమ్లానాయ‌క్‌.. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌

ఇప్పుడు టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్ మూవీల హ‌వా సాగుతోంది. ఇక క్రేజీ కాంబోగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌గ్గుబాటి రానాలు క‌లిసి న‌టిస్తున్న మూవీ భీమ్లా నాయక్ పై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. ఇక ఈ మూవీని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసేందుకు రెడీ అవుతున్నారు మూవీ మేక‌ర్స్‌. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పవన్ టీజర్, టైటిల్ సాంగ్ నెట్టింట ప్రకంపనాలు సృష్టించాయి. అయితే మూవీ మొత్తం ప‌వ‌ర్ స్టార్‌నే హైలెట్ చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డంతో అస‌లు రానా ఇందులో ఉన్నాడా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి. ఇంకా చెప్పాలంటే రానా ఫ్యాన్స్ కొంచెం హ‌ర్ట్ అయ్యారు.

ఈ మూవీలో రానా క్యారెక్టర్ కి అంతగా స్కోప్ లేద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక సెక్షన్ విమర్శించ‌డం స్టార్ట్ చేసింది. అయితే ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో రానాకు సంబంధించిన పాత్రను కూడా ఏమాత్రం తగ్గించబోమని ఆయ‌న క్యారెక్ట‌ర్‌కు కూడా మంచి స్కోప్ుంటుంద‌ని చిత్రబృందం క్లారిటీనిచ్చింది. ఇక ఇప్ప‌టికే రానా పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా కొంత వ‌ర‌కు జ‌రిగింద‌ని, ఆయ‌న పాత్ర‌పై కూడాత్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామ‌ని మూవీ మేక‌ర్స్ రీసెంట్ గా వివ‌రించారు. కాగా వారు చెప్పిన టీజ‌ర్ విడుద‌ల‌కు టైమ్ వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీ తర్వాత ఏ రోజు అయినా విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది.

ఇక రానా టీజ‌ర్ కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా పవన్ టీజర్ తరహాలోనే పవర్ ఫుల్ గా ఉండేలా వారు ప్లాన్ చేస్తున్నారు. దీంతో రానా అభిమానులు చాలా ఉత్సాహంగా టీజ‌ర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రెండు రోజుల్లోనే టీజర్ విడుదల చేయ‌బోయే తేదీని కూడా ప్రకటించనున్నట్టు స‌మాచారం. ఇక మ‌రో విష‌యం ఏంటంటే ఈ మూవీ ప‌వ‌న్ రేంజ్ ను పెంచ‌డంతో పాటు రానా రేంజ్‌ను కూడా పెంచుతుంని చెబుతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, సాంగ్‌లో ఓ రేంజ్‌లో హైప్ ద‌క్కించుకుంది ఈ మూవీ. ఇక దీన్ని మలయాళ మూఈ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ గా తీస్తున్నారు. భీమ్లా నాయక్ ను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.

rana..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

God Father : మెగాస్టార్లతో ‘లైగర్’ టీమ్..

God Father: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సెట్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్...

Pawan Kalyan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’.. కాస్ట్ ఎంతంటే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్‌కి పూనకాలే.. స్క్రీన్...

Kamal Haasan : మరో అరుదైన ఘనత.. కమల్ జోష్ కంటిన్యూ అవుతోంది..

Kamal Hassan: కాస్త టైం గ్యాప్ అంతే.. కొడితే మాత్రం తిరుగుండదు అన్నట్లు యూనివర్సల్ స్టార్...

Vikrant Rona Trailer : భయం అంటే ఏంటో తెలియని వాడే ‘విక్రాంత్ రోణ’.. ట్రైలర్ అదిరిందిగా!

Vikrant Rona Trailer: పాపులర్ కన్నడ స్టార్, ‘బాద్‌షా’, ‘కిచ్చా’ సుదీప్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్...