Home Uncategorized ద‌స‌రా బ‌రిలో మూడు పెద్ద సినిమాలు.. నేరుగా థియేట‌ర్ల‌లోనే..
Uncategorized

ద‌స‌రా బ‌రిలో మూడు పెద్ద సినిమాలు.. నేరుగా థియేట‌ర్ల‌లోనే..

balakrushna..

క‌రోనా వ‌ల్ల టాలీవుడ్ ఇండ‌స్ట్రీ చాలా వ‌ర‌కు న‌ష్ట‌పోయింది. ఇక చాలా రోజుల త‌ర్వాత థియేట‌ర్లు ఓపెన్ అయినా కూడా పెద్ద సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కావ‌ట్లేదు. అయితే థియేట‌ర్లు ఓపెన్ అయి చాలా రోజులే అవుతున్నా జనాలు మాత్రం ఈ సెప్టెంబ‌ర్ నెలలోనే ఎక్కువ‌గా థియేటర్లకు వ‌స్తున్నారు. ఇక జ‌నాలు కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు ధైర్యం చేసి వ‌స్తుండ‌టంతో పెద్ద మూవీల‌ను రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధం అంటున్నారు. పైగా రీసెంట్ గా వ‌చ్చిన గోపీచంద్ మూవీ సిటీమార్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను సొంతం చేసుకుంది. హౌస్ ఫుల్ కలెక్ష‌న్స్ తో దూసుకుపోతోంది.

కాబ‌ట్టి పెద్ద సినిమాల‌ను రిలీజ్ చేయొచ్చ‌ని అంతా భావిస్తున్నారు. ఇక దసరా పండుగ వ‌చ్చే నెల‌లో ఉన్న త‌రుణ‌లో పెద్ద ఎత్తున పెద్ద హీరోల మూవీలు రిలీజ్ చేయ‌నున్నారు. ఆ నెల‌లో సెల‌వులు కూడా బాగానే ఉంటాయి కాబ‌ట్టి పండుగ సీజ‌న్‌ను క్యాచ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. బాల‌కృష్ణ న‌టిస్తున్న అఖండ మూవీని ఇప్ప‌టికే దసరాకు రిలీజ్ చేస్తార‌ని అంటున్నారు. ఇక దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న‌ట్టు తెలుస్తోంది. దాంతో పాటు అక్కినేని హీరో అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మూవీ కూడా ద‌స‌రాకే రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు.

వీరితో పాటు విక్ట‌రీ వెంక‌టేశ్ న‌టించిన దృశ్యం-2 మూవీని కూడా దసరాకు విడుదల చేస్తామని చెబుతున్నారు. కాగా దృశ్యం-2ను కూడా నారప్ప మూవీని ఓటీటీ లో విడుదల చేసినట్టు అక్క‌డే చేయాల‌ని అనుకున్నారు. కానీ తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో థియేటర్లలోనే విడుదల చేయాలని లేదంటే విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మేకర్స్ వెన‌క‌డుగు వేశారట. కాక‌పోతే మిగ‌తా సినిమాల రిలీజ్ డేట్లు ఖరారు అయితే దృశ్యం 2 రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయాల‌ని చూస్తున్నారంట‌. ఇక ఈ మూడు సినిమాల‌తో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాలు కూడా విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

God Father : మెగాస్టార్లతో ‘లైగర్’ టీమ్..

God Father: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సెట్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్...

Pawan Kalyan : ‘వాచ్ అమ్మితే బ్యాచ్ సెటిలైపోద్ది’.. కాస్ట్ ఎంతంటే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే ఫ్యాన్స్‌కి పూనకాలే.. స్క్రీన్...

Kamal Haasan : మరో అరుదైన ఘనత.. కమల్ జోష్ కంటిన్యూ అవుతోంది..

Kamal Hassan: కాస్త టైం గ్యాప్ అంతే.. కొడితే మాత్రం తిరుగుండదు అన్నట్లు యూనివర్సల్ స్టార్...

Vikrant Rona Trailer : భయం అంటే ఏంటో తెలియని వాడే ‘విక్రాంత్ రోణ’.. ట్రైలర్ అదిరిందిగా!

Vikrant Rona Trailer: పాపులర్ కన్నడ స్టార్, ‘బాద్‌షా’, ‘కిచ్చా’ సుదీప్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్...