Home Film News ‘మా’ ఎలక్షన్లలో బాలయ్య సపోర్ట్ ఏ ప్యానల్ కి అంటే..
Film News

‘మా’ ఎలక్షన్లలో బాలయ్య సపోర్ట్ ఏ ప్యానల్ కి అంటే..

Balayya To Support Manchu Vishnu Panel In MAA Elections

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మార్చారు నందమూరి బాలకృష్ణ. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటాపోటీగా మా ఎన్నికల సంధర్భంలో మాట్లాడిన విషయం తెలిసిందే. వాళ్ళు ఇప్పటిదాకా చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్ లో బానే దుమారం రేపాయి. వాళ్ళిద్దరూ.. ఎవరికి వారుగా తమని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ చిట్టాతో మా సంఘంలో తేవాలనుకుంటున్న మార్పు గురించి మాట్లాడారు. ప్రకాష్ రాజ్ వర్గం ఇప్పటికే అధికారంలో ఉన్న ప్యానల్ చేస్తున్న తప్పుల గురించి మాట్లాడితే.. నరేష్ వర్గం వాటిని డిఫెండ్ చేసుకుంటూ తమని తాము సమర్థించుకుంది.

ఐతే, ప్రస్తుతానికి వీళ్లిద్దరిని మాత్రమే ప్రధాన పోటీ దారులుగా చూడాల్సి ఉంటుంది. ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసే ఆసక్తితో ఉన్న హేమ, జీవిత రాజశేఖర్ లకి సినీ పెద్దల నుంచి పెద్దగా మద్దతు ఉండకపోవచ్చు. టాలీవుడ్ లో ప్రధాన కుటుంబాల నుంచి వీళ్ళకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రకాష్ రాజ్ కి గానీ, మంచు విష్ణుకి గానీ సపోర్ట్ చేసే ఆసక్తితో ఉంటారు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎటువైపు సపోర్ట్ చేస్తారన్న విషయం చాలా ఆసక్తిగా మారింది.

మెగా కుటుంబం మద్దతు ఇప్పటికే ప్రకాష్ రాజ్ వైపు ఉందన్న విషయం నాగబాబు మాట్లాడటం ద్వారా తేలడంతో.. ఇక మెల్లగా మరో పెద్ద కుటుంబం కూడా వాళ్ళ మద్దతు ఎటువైపు ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసేసింది. ఈ మధ్య ఒకసారి మీడియాతో మాట్లాడిన బాలకృష్ణకి ఈ ప్రశ్న ఎదురైనప్పుడు మంచు విష్ణుకి సపోర్ట్ ఉంటుందని చెప్పేశాడు. అంటే, నందమూరి తరపు సినీ నటులంతా విష్ణుకే వోట్ చేయబోతున్నారు. బాలకృష్ణ చెప్పిన ఈ విషయం మొత్తానికి ఈ ఎన్నికలని మరింత ఆసక్తిగా మార్చబోతుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...