Home Film News Prabhas-Maruthi: ప్ర‌భాస్- మారుతి సినిమా కోసం ఇలాంటి విచిత్ర‌మైన టైటిల్ పెడుతున్నారా..!
Film News

Prabhas-Maruthi: ప్ర‌భాస్- మారుతి సినిమా కోసం ఇలాంటి విచిత్ర‌మైన టైటిల్ పెడుతున్నారా..!

Prabhas-Maruthi: డార్లింగ్ ప్ర‌భాస్ లైన‌ప్ మాములుగా లేదు. ఆయ‌న చివ‌రిగా ఆదిపురుష్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రం దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రం దారుణంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఇప్పుడు ఆయ‌న త‌దుప‌రి సినిమాల‌పై అభిమానులు దృష్టి సారిస్తున్నారు. ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ చిత్రం ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రోవైపు ప్రాజెక్ట్ కే, మారుతి సినిమా, స్పిరిట్ చిత్రంతో పాటు ప‌లు చిత్రాలు కూడా సెట్స్ పై ఉన్నాయి. అయితే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ చేస్తున్న సినిమా కామెడీ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ  చిత్రం 20 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంద‌ని అంటున్నారు.
గ‌త కొద్ది రోజులుగా  ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది.  అయితే ఇప్పుడు మ‌రో రెండు టైటిల్స్ సినిమాకి ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని మారుతి  పూర్తిగా హర్రర్ నేపథ్యంలో రూపొందిస్తుండ‌గా, చిత్రంలో ప్ర‌భాస్‌కి జోడీగా శ్రీలీలతో పాటు మాళవిక మోహన్ నటిస్తున్నట్టు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ప్ర‌భాస్ గ‌త సినిమాల‌కి భిన్నంగా చాలా త‌క్కువ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది.  అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ కోసం   రెండు టైటిల్స్  ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. అందులో  ఒకటి ‘రాయల్’ కాగా.. మరొకటి ‘అంబాసిడర్’ అని టాక్. ఈ రెండింటిలో ఒక టైటిల్‌ని సినిమాకి ఫిక్స్ చేస్తార‌ని అంటున్నారు.   ‘అంబాసిడర్’ అనే కారు ఎంత పాపుల‌రో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు ఇదే పేరు సినిమాకి పెడితే మంచి ఆద‌ర‌ణ ఉంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.
ఇక ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ చిత్రం ఆదిపురుష్ విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం తొలి మూడు రోజుల‌లో భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. కాని రాను రాను మూవీ క‌లెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. బ్రేక్ ఈవెన్ కూడా ఈ చిత్రం అందుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు.  ఇప్ప‌టికే సాహో, రాధే శ్యామ్ వంటి ఫ్లాపుల‌తో నిరాశ‌లో ఉన్న ప్ర‌భాస్‌కి ఆదిపురుష్  చిత్రం మ‌రింత దెబ్బ కొట్టింద‌నే చెప్పాలి. ఇప్పుడు ప్ర‌భాస్‌తో పాటు ఆయ‌న అభిమానుల దృష్టి స‌లార్ పై ఉంది. ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...