Home Film News Pawan Kalyan: కొన్నాళ్లుగా ప‌వ‌న్‌తో కనిపించ‌ని మూడో భార్య‌.. ఆమెతోను విడాకులు తీసుకున్నాడా.!
Film News

Pawan Kalyan: కొన్నాళ్లుగా ప‌వ‌న్‌తో కనిపించ‌ని మూడో భార్య‌.. ఆమెతోను విడాకులు తీసుకున్నాడా.!

Pawan Kalyan: ఇటీవ‌ల మెగా ఫ్యామిలీ తెగ వార్త‌లలో నిలుస్తుంది. ఒక‌వైపు శుభ‌వార్త‌లు చెబుతూనే మ‌రోవైపు ఆ ఫ్యామిలీలోని కొంద‌రు అభిమానుల‌ని నిరాశ‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మెగా అభిమానులు  రామ్ చ‌ర‌ణ్ తండ్రి ఎప్పుడు అవుతాడా అని  ఎంతో ఆశ‌గా ఎదురు చూడగా, ఎట్ట‌కేల‌కు జూన్ 20న ఉపాస‌న‌కి పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. దీనికి ముందు మెగా హీరో వ‌రుణ్ తేజ్ త‌న ప్రేయ‌సి లావ‌ణ్య త్రిపాఠితో నిశ్చితార్థం జ‌రుపుకున్నాడు. ఏ రోజు కూడా వీరు త‌మ రిలేష‌న్‌పై ఓపెన్ కాకుండా డైరెక్ట్‌గా ఇలా నిశ్చితార్థం జ‌రుపుకునే స‌రికి అంద‌రు షాక్ అయ్యారు.

అయితే ఇలా వ‌రుస శుభ‌వార్త‌లు ఫ్యాన్స్‌కి ఆనందాన్ని పంచాయి. ఇక ఇదే స‌మ‌యంలో జూన్ 4న నిహారిక విడాకులు ద‌ర‌ఖాస్తు చేసిన పిటీష‌న్ ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ అమ్మ‌డి విడాకుల‌పై క్లారిటీ వ‌చ్చేసింది. కొన్నాళ్లుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్నా అవి పుకార్లు అయి ఉండొచ్చు అని ఫ్యాన్స్ అనుకున్నారు. కాని నిన్న‌టితో వాటిపై క్లారిటీ వ‌చ్చింది. ఇప్ప‌టికే శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్ద‌రు భ‌ర్త‌ల‌కి విడాకులు ఇవ్వ‌గా, నిహారిక కూడా ఇలా చేయ‌డం ఎవ‌రికి మింగుడుప‌డ‌డం లేదు. ఇక ఇదే స‌మయంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మూడో భార్య‌కి కూడా విడాకులు ఇచ్చి ఆమెకు దూరంగా ఉంటున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది.

నందిని, రేణూ దేశాయ్ నుండి విడాకులు తీసుకున్నాక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. 2013లో రష్యాకి చెందిన నటి అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు పవన్‌. ఈ దంప‌తుల‌కి  పొలెనా అంజనా పవనోవా, కుమారుడు  మార్క్ శంకర్‌ పవనోవిచ్‌ అనే  ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా అన్నా లెజినోవా కూడా ప‌వ‌న్‌కి దూరంగా ఉంటుంద‌ని, భ‌ర్త‌ని వదిలేసి సొంతూరు(రష్యాకి)పిల్ల‌ల‌తో  వెళ్లిపోయిందని కొంద‌రు చెప్పుకొస్తున్నారు . మ‌రి కొంద‌రేమో సింగపూర్ వెళ్లింద‌ని అంటున్నారు. చాలా రోజులు క్రితమే అన్నా వెళ్లిపోగా, ఆమె ఇక తిరిగి రాద‌ని జోరుగా ప్ర‌చారాలు చేస్తున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. కాగా, ప‌వ‌న్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక ప్ర‌తి ఒక్క‌రు కూడా త‌న పెళ్లిళ్ల విష‌యంలోనే విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...