Home Film News Samantha: అభిమానుల‌కి పెద్ద షాకిచ్చిన స‌మంత‌.. ఏడాది పాటు ఇక‌..
Film News

Samantha: అభిమానుల‌కి పెద్ద షాకిచ్చిన స‌మంత‌.. ఏడాది పాటు ఇక‌..

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల షాకులు మీద షాకులు ఇస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌కి విడాకులు ఇచ్చిన  స‌మంత ఆ త‌ర్వాత మ‌యోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాల‌కి , సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంది. ఇక పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి అతి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుండ‌గా, అందులో స‌మంత దారుణంగా రొమాన్స్ చేసింద‌ని అంటున్నారు.ఇలా స‌మంత ఇటీవ‌ల ప‌లు విష‌యాల‌తో తెగ హ‌ట్ టాపిక్ అవుతుండ‌గా, ఇప్పుడు త‌న అభిమానుల‌కి మాత్రం పెద్దా షాకే ఇచ్చింది. ఏడాది పాటు సినిమాల‌కి లాంగ్ బ్రేక్ ఇవ్వాల‌ని స‌మంత అనుకుంటుంద‌ట‌.

య‌శోద చిత్రం త‌ర్వాత మ‌యోసైటిస్ వ‌ల‌న కొన్నాళ్ల పాటు ఆసుప‌త్రిలో అడ్మిట్ అయింది స‌మంత‌. కోలుకున్న త‌ర్వాత శాకుంత‌లం సినిమా ప‌నులు పూర్తి చేసింది. ఇక ఇప్పుడు   శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో “ఖుషి” సినిమా చేస్తుంది. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఇక “సిటాడెల్” వెబ్ సిరీస్ తో స‌మంత బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా,దీనిని కూడా త్వ‌ర‌లోనే పూర్తి చేయ‌నుంద‌ని అంటున్నారు. ఇక స‌మంత త‌ర్వాత  ఏ ప్రాజెక్టుకు ఓకే చెబుతుందోనని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్రమంలో పెద్ద షాక్ ఇచ్చింది.

రెండేళ్లుగా సమంత వరుస షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్న నేప‌థ్యంలో సమంత తన ఆరోగ్యం పట్ల కీలక నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. ఏడాది వ‌రకు స‌మంత ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు సైన్ చేయదని సమాచారం.  తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్న నేప‌థ్యంలో స‌మంత ఈ నిర్ణయం తీసుకుంద‌ని స‌మంత పీఆర్‌టీం తెలిపింది. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే ఆమె తిరిగి సినిమాలపై దృష్టి పెట్ట‌నుంది. అయితే ఖుషీ మూవీ ప్ర‌మోష‌న్స్ తో పాటు సిటాడెల్ ప్ర‌మోష‌న్స్ లో మాత్రం ఆమె క‌నిపించే అవ‌కాశం ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...