Home Film News Jr NTR : అభిమానికి అండగా ఎన్టీఆర్.. వీడియో వైరల్..
Film News

Jr NTR : అభిమానికి అండగా ఎన్టీఆర్.. వీడియో వైరల్..

Jr NTR
Jr NTR

Jr NTR: తెరమీద తాము అందించే వినోదానికి అభిమానులుగా మారి.. కుటుంబంతో పాటు తమ అభిమాన హీరో కూడా తమ జీవితాల్లో ఓ భాగం అనుకునే అభిమానులు, వీరాభిమానులు ఎందరో ఉంటారు. వారి అభిమానం మాటల్లో చెప్పలేనిది. అందుకే అభిమానునుద్దేశించి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అంటుంటారు కథానాయకులు.

తన అభిమాని అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకుని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అతని తల్లిని ఫోన్‌లో పరామర్శించి.. ధైర్యం చెప్పిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనార్థన్.. ఎన్టీఆర్‌కి వీరాభిమాని. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు జనార్థన్. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉందనే విషయం తెలుసుకున్న తారక్.. జనార్థన్ తల్లితో మాట్లాడారు.

‘మీరు అధైర్యపడకుండా దేవుడిని నమ్మండి.. దేవుడి పైన భారం వెయ్యండి.. మేమందరం కూడా ప్రార్థిస్తాం.. త్వరలోనే తను కోలుకుని వస్తాడు’.. అంటూ జనార్థన్ తల్లికి తారక్ ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్‌తో మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఫోన్ స్పీకర్ ఆన్ చెయ్యగా.. జనార్థన్‌తో కూడా తారక్ మాట్లాడారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులు కూడా తోటి అభిమానిగా జనార్థన్‌కి తమ వంతు సాయమందించడానికి ముందుకొచ్చారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...