Home Film News Hero: క‌షాయం అని చెప్పి 8 నెల‌ల పాటు విషం తాగించారంటూ హీరో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Film News

Hero: క‌షాయం అని చెప్పి 8 నెల‌ల పాటు విషం తాగించారంటూ హీరో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Hero: ఒక‌ప్పుడు త‌న న‌ట‌న‌తో పాటు లుక్స్ తో ఎంతగానో ఆక‌ట్టుకున్న హీరో జేడీ చక్ర‌వ‌ర్తి. అప్పట్లో ఆయ‌న సినిమాల‌కి విప‌రీత‌మైన వీరాభిమానులు ఉండేవారు.  విలక్షణ నటుడిగా పేరుపొందిన జేడి చ‌క్ర‌వ‌ర్తి కేవ‌లం హీరోగానే కాకుండా విలన్‌గా,  సపోర్టింగ్‌ యాక్టర్‌గా ఆయన ఎన్నో సినిమాలు చేశారు.  వ‌ర్మ తెర‌కెక్కించిన‌ ‘శివ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన జేడీ చక్రవర్తి  గులాబీ సినిమాతో మంచి విజయాన్ని త‌న ఖాతాలో వేసుకొని అక్క‌డ నుండి దూసుకుపోయాడు. జేడీ త‌న కెరీర్‌లో  మూడు చిత్రాలకు దర్శకత్వం వహించి  స‌త్తా చాటాడు. ఇక చాలా రోజుల త‌ర్వాత  జేడీ   ‘దయ’ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల‌ని అల‌రించ‌బోతున్నాడు. ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ కానుంది.

ఈ క్ర‌మంలో జేడీ చ‌క్ర‌వ‌ర్తి  తనను చావుల అంచులదాకా తీసుకెళ్లిన ఒక పర్సనల్ లైఫ్‌ ఇన్సిడెంట్‌ను తాజా ఇంట‌ర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.  త‌న‌కి క్లోజ్‌గా ఉండే వ్యక్తి కొన్నినెలల పాటు  స్లో పాయిజన్ ఇవ్వడంతో చావు అంచులదాకా వెళ్లాన‌ని స్ప‌ష్టం చేశారు. నాకు స‌డెన్‌గా బ్రీతింగ్ ప్రాబ్ల‌మ్ వ‌చ్చింది. అది ఎందుకో అర్ధం కాలేదు. డ్రగ్స్, సిగరెట్లు, మందు లాంటి అలవాట్లు కూడా లేవు. అయిత‌న ఎందుకు ఇలా జ‌రిగిందో అర్ధం కాలేదు. అప్పుడు  నా క్లోజ్ ఫ్రెండ్  అయిన ఉత్తేజ్ శ్రీనివాసన్ అనే డాక్టర్‌ను క‌లిసి చూపించుకున్నాను. అలాగే ఇండియా, శ్రీలంకలోఉన్న  చాలా మంది డాక్టర్లని కూడా సంప్రదించా. స‌మ‌స్య ఎవ‌రు క‌నిపెట్ట‌లేక‌పోయారు. ఒకానొక సంద‌ర్భంలో డాక్టర్స్ క‌ష్ట‌మ‌ని కూడా చెప్పారు.

అయితే ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ప్రొడ్యూసర్ నా చిన్నప్పటినుంచి ఫ్రెండ్‌. అతడు నన్ను చాలా ఇబ్బందుల్లోనుంచి కాపాడాడు.  నాగార్జున అనే డాక్టర్‌ నాకు జీవితాన్ని ఇచ్చారు. ఆయన కొన్ని టెస్టులు చేయ‌గా, అందులో నాకు గత 8 నెలలుగా స్లో పాయిజన్‌ ఇస్తున్నారని తేలింది. నేను తీసుకుంటున్న కషాయంలో స్లో పాయిజన్‌ ఉన్నట్లు తేలింది. ఎలాంటి అలవాట్లు లేవు గనుక నా బాడీ స్లో పాయిజన్‌ను తొంత‌ర‌గా రిసీవ్ చేసుకోలేదు అని  క్లియర్ గా చెప్పారు. నా ఫ్రెండ్ కూడా నా క‌షాయం తాగాడు. వాడికి కొన్ని అల‌వాట్లు ఉండ‌డం వ‌ల‌న రియాక్ష‌న్ తొంద‌ర‌గా చూపించింది. దగ్గ‌ర వ్య‌క్తే త‌న‌పై ఇలాంటి కుట్ర ప‌న్నినందుకు జేడీ చాలా  ఎమోష‌న‌ల్ అయ్యాడు.

Related Articles

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. అమీర్ ఖాన్ కూతురు మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఫ్యాన్స్..!

చిత్ర పరిశ్రమను వరుస‌ విషాదాలు వెంటాడుతున్నాయి. అగ్ర సెలబ్రిటీలు మరణించారు అన్న విషాదం మరవకముందే మరొక...

వార్‌2 షూటింగ్ అండ్ క్రేజీ అప్డేట్… ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందిగా..!

టాలీవుడ్‌లో హీరోలుగా రాణించినప్పటికీ ప్రతి హీరోకి బాలీవుడ్‌లో కూడా తన సత్తా చూపించాలని ఉంటుంది. అలా...

చిరంజీవి VS పవన్.. ఎవ‌రు తగ్గట్లేదుగా..!

మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగులో ఉన్న...