Home Film News అనుష్కకి ఈ రెండు నెలలు అగ్నిపరీక్షే..
Film News

అనుష్కకి ఈ రెండు నెలలు అగ్నిపరీక్షే..

ANUSHKA
ANUSHKA

‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యోగా టీచర్ స్వీటీ, తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ‘అరుంధతి’ తో అనుష్క కెరీర్ గ్రాఫే మారిపోయింది. తనకోసమే లేడీ ఓరియంటెడ్ కథలు రాసేవారు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు వెయిట్ చేసేవాళ్లు. ‘పంచాక్షరి’, ‘భాగమతి’ తర్వాత ‘సైజ్ జీరో’ అనే సినిమా కోసం ప్రయోగం చేసింది అనుష్క.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేయగా.. ఆయన మాజీ భార్య కనికా థిల్లాన్ కథ రాశారు. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ రిలీజ్ చేశారు. సినిమా డిజాస్టర్ అయింది. ఈ మూవీతో ఇంకా మంచి పేరు, ఫేమ్ వస్తుందనుకుని దాదాపు 20 కిలోల వరకు వెయిట్ పెరిగింది అనుష్క. కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది.

అప్పటి వరకు తన హైటుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ ఫిజిక్ మేయింటైన్ చేసిన స్వీటీ, సైజ్ జీరో కోసం చేసిన ఛాలెంజింగ్ రోల్ తన కెరీర్‌ను చాలా మార్చేసింది. అంటే అది పాజిటివ్‌గా కాదు..నెగిటివ్‌గా.. క్యారెక్టర్ పరంగా లావెక్కేందుకు చేసిన వర్కౌట్స్ ఆమెకి శాపంగా మారాయి. ముద్దుగుమ్మ కాస్తా బొద్దుగుమ్మగా మారడంతో హీరోయిన్‌గా అవకాశాలు దాదాపు తగ్గిపోయాయి.

బాహుబలి సినిమా సిరీస్‌లో స్వీటీ బాగా లావుగా కనిపించడం వల్ల గ్రాఫిక్స్‌లో మేనేజ్ చేయడానికి మేకర్స్ బాగానే శ్రమించారు. ‘సైజ్ జీరో’ చేసి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా అనుష్క అదే ఆకారంలో ఉండిపోయింది. దీనికోసం ఆస్ట్రేలియాలోని ఓ ఫేమస్ మెడికల్ సెంటర్‌లో నేచురోపతిక్ ట్రీట్ మెంట్ తీసుకుంది. అయినా కానీ ఇంతకుముందులా మారలేకపోయింది. బ్యాక్ పెయిన్ కారణంగా జిమ్‌లో ఎక్కువగా కసరత్తులు చేయలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆర్గానిక్ ట్రీట్‌మెంట్ కోసం ట్రై చేస్తుందని తెలుస్తోంది.

లేటెస్ట్ యూత్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ శెట్టి’ (ప్రచారంలో ఉంది) అనే సినిమా సైన్ చేసింది అనుష్క. షూటింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే టైం ఉంది. ఈలోపు ఆమె వెయిట్ తగ్గాలి. అప్పటిలోగా అనుష్క ఫిజిక్‌లో మార్పులొస్తాయేమో చూడాలి మరి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...