Home Film News Rajinikanth: షూటింగ్ లో రజనీకాంత్‌కి ఘోరమైన అవ‌మానం.. నీ మోహానికి కారు కూడానా.. అంటూ
Film News

Rajinikanth: షూటింగ్ లో రజనీకాంత్‌కి ఘోరమైన అవ‌మానం.. నీ మోహానికి కారు కూడానా.. అంటూ

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రజంట్ భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రజంట్ ఆయన వయస్సు 72 ఏళ్లు.. దాదాపుగా 50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. కోలీవుడ్ లో సినిమాలు చేస్తే సౌత్ సినీ ఇండస్ట్రీకి తలైవాగా పేరు సాధించుకున్నారు. రజనీకాంత్ సినిమాల్లో నటుడిగా, విలన్ గా, నిర్మాతగా ఎన్నో పాత్రలు పోషించారు. ఆయనకు పద్మ విభూషణ్, పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ తో పాటు నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డుటు, జాతీయ పురస్కారం అవార్డులు ఇలా ఎన్నో సాధించారు. అలాంటి రజనీకాంత్ లైఫ్ లో ఓ చేదు అనుభవం ఎదురైంది. కోలీవుడ్ లోని ఓ ఫేమస్ ప్రొడ్యూసర్.. రజనీకాంత్ ను మీ మోహానికి కారు కూడానా అంటూ అవమానంగా మాట్లాడారట. రజనీకాంత్ సినిమాలు స్టార్ట్ చేసిన కొత్తగా రెమ్యునరేషన్ కేవలం వేలల్లోనే ఉండేది.

అలా ఓ నిర్మాత రజనీకాంత్ ని హీరోగా పెట్టి సినిమా తీస్తానని 6000 రూపాయలు రెమ్యునరేషన్ కు ఫిక్స్ చేశారట. రజనీకాంత్ కూడా నెక్ట్స్ డే షూటింగ్ కోసం నిర్మాత పంపిన కారులోనే షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు. అప్పుడే నిర్మాత షూటింగ్ మొదలు పెట్టేముందు వెయ్యి రూపాయల అడ్వాన్స్ ఇస్తానని అన్నారట. ఆ విషయమే నిర్మాతకు గుర్తు చేసి.. రజనీకాంత్ అడ్వాన్స్ అడిగితే.. నువ్వేమైనా పెద్ద స్టార్ వి అనుకుంటున్నావా, అడగ్గానే డబ్బులు ఇచ్చేయడానికి.. సినిమా మొత్తం అయ్యాకే ఇస్తాను అని చాలా హేళనగా మాట్లాడారట. అలాగైతే మీ సినిమాలో నేను హీరోగా చేయను అని.. నన్ను కారులో ఇంటి దగ్గర దింపేయమని అడిగితే.. నీ మొహానికి కారు కూడా పంపాలా.. నడుచుకుంటూ వెళ్లూ అని చాలా అవమానకరంగా.. నీచంగా మాట్లాడారట.

ఈ మాటలకు రజనీకాంత్ చాలా బాధపడ్డారట. అప్పుడే రజనీకాంత్ కారు కొనాలని ఫిక్స్ అయ్యి.. చాలా కష్టపడి 5 లక్షల విలువైన కారు కొని దానికి ఒక ఫారిన్ డ్రైవర్ ను పెట్టుకుని.. ఎవరైతే రజనీకాంత్ ను అవమానించారో.. ఆ నిర్మాత ఇంటి దగ్గరకు వెళ్లి.. ఆయన చూస్తుండగానే రెండు రౌండ్లు వేసి.. ఆ ప్రొడ్యూసర్ ముందు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని స్టైల్ గా సిగరెట్ తాగారట. అలా తనకు జరిగిన అవమానానికి పగ తీర్చుకున్నారన్నమాట. ఒక కండెక్టర్ పొజిషన్ నుండి ఈరోజు ఇంత పెద్ద స్టార్ గా నిలిచి ఎంతోమంది యంగ్ హీరోలకు ఆదర్శంగా రజనీకాంత్ నిలిచిన సంగంతి తెలిసిందే

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...