Home Film News Siddharth: అదితితో ఎఫైర్ నిజ‌మేన‌ని చెప్పిన సిద్ధార్థ్‌.. మొత్తానికి ఇలా ఓపెన్ అయ్యాడు..!
Film News

Siddharth: అదితితో ఎఫైర్ నిజ‌మేన‌ని చెప్పిన సిద్ధార్థ్‌.. మొత్తానికి ఇలా ఓపెన్ అయ్యాడు..!

Siddharth: సినిమా ఇండ‌స్ట్రీలో సెల‌బ్రిటీల మ‌ధ్య ప్రేమలు ఎప్పుడు ఎలా పుడ‌తాయో ఎవ‌రికి తెలియ‌దు. అప్ప‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్నవారు ప్రేమికుల మాదిరిగా మారి ఎంచ‌క్కా చెట్టాప‌ట్టాలేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సిద్ధార్థ్, అదితి రావు హైద‌రి జంట ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఇటీవ‌ల వీరిద్ద‌రు క‌లిసి తెగ సందడి చేయ‌డం చూస్తున్నాం. ముంబై వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగ‌డం, కలిసి డిన్నర్‌ లంచ్, పార్టీలకు వెళ్ల‌డం చేస్తున్నారు. శర్వానంద్ నిశ్చితార్థానికి క‌లిసి వ‌చ్చిన ఈ జంట పెళ్లిలో కూడా క‌లిసే క‌నిపించారు. ఇలా ఎక్కడికి వెళ్లినా కలిసి కనిపిస్తుండటంతో వీరిద్దరి మ‌ధ్య ప్రేమ ఉంద‌ని అంద‌రు భావిస్తున్నారు.

అయితే దీని గురించి ప్ర‌శ్నిస్తే మాత్రం ఎలాంటి స‌మాధానం లేదు.కాగా, మహాసముద్రం సినిమాలో అదితి, సిద్దార్థ్ కలిసి నటించారు. అంతకుముందు నుంచే వీరికి పరిచయం ఉన్నా ఈ సినిమా నుండే బాగా క్లోజ్ అయిన‌ట్టు తెలుస్తుంది.ప్ర‌స్తుతం డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు కూడా ఎక్కే అవ‌కాశం లేక‌పోలేదు అంటున్నారు. అయితే ఇన్నాళ్లు వారి రిలేష‌న్ షిప్‌పై మౌనంగా ఉన్న సిద్ధార్థ్ తాను అదితితో ప్రేమ‌లో ఉన్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. రీసెంట్‌గా ఓ టీవీ షోలో ప్రసారం అవుతున్న డాన్స్ షోకి అతిథిగా హాజరయ్యారు సిద్ధార్థ్‌. షోకి హోస్ట్‌గా ఉన్న‌ యాంకర్ శ్రీముఖి ఆయ‌న‌ని ఒక ప్రశ్న అడిగారు.

మీరు ఎవ‌రితో జీవితాంతం కలిసి డాన్స్ చేయాలని అనుకుంటున్నారు? అని అడగ్గా… అందుకుగాను ‘మా ఊళ్ళో అతిథిదేవోభవ అంటారు’ అని సిద్ధార్థ్ సమాధానం చెప్పారు. అతిథిదేవోభవలో అతిధి అనే పేరుంది కాబట్టి సిద్దార్థ్ ఇలా పరోక్షంగా ఇలా హింట్ ఇచ్చారని, అదితి రావు హైదరిని ఆయన లైఫ్ టైం డాన్స్ పార్టనర్ గా ఉండాలని కోరుకుంటున్నాడ‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. ఇన్‌డైరెక్ట్‌గా ఆయ‌న అదితితో ప్రేమ‌లో ఉన్న‌ట్టు ఒప్పుకున్నాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సిద్ధార్థ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...