Home Film News Prabhas: పాపం ప్ర‌భాస్ ప‌రిస్థితి ఏంటి ఇలా అయింది.. ఇబ్బంది పెడుతున్న వ‌రుస స‌మ‌స్య‌లు..!
Film News

Prabhas: పాపం ప్ర‌భాస్ ప‌రిస్థితి ఏంటి ఇలా అయింది.. ఇబ్బంది పెడుతున్న వ‌రుస స‌మ‌స్య‌లు..!

Prabhas: డార్లింగ్ ప్ర‌భాస్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాహుబ‌లి సినిమాకి ముందు తెలుగు రాష్ట్రాల‌లో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ప్ర‌భాస్ బాహుబ‌లి చిత్రం త‌ర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. బాహుబ‌లి సినిమా కోసం ప్ర‌భాస్ ఐదేళ్లు కాల్షీట్స్ కేటాయించ‌గా, ఈ సినిమా కోసం ప్ర‌భాస్ ప‌డ్డ క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్కింది. అయితే బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నుండి సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు విడుద‌ల కాగా, ఈ మూడు కూడా దారుణంగా నిరాశ‌ప‌రిచాయి.ఇందులో ఒక్క హిట్ ప‌డ్డా కూడా ప్ర‌భాస్ క్రేజ్ మ‌రింత పెరిగి ఉండేది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో అర‌డ‌జ‌నుకి పైగా సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల‌పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

ఎక్కువ గ్యాప్ లేకుండా తక్కువ వ్యవధిలోనే సినిమాలు రిలీజ్ చేయాలని భావిస్తున్న ప్ర‌భాస్ విరామం లేకుండా షూటింగ్స్ చేస్తున్నాడు.   నిరంతరాయంగా షూటింగ్స్ లో పాల్గొనడంవల్ల  ఆయ‌న అనారోగ్యానికి గురైన‌ట్టు తెలుస్తుంది.దీంతో ప్ర‌భాస్ ఏడాది పాటు విశ్రాంతి తీసుకోనున్నాడ‌ని అంటున్నారు. కంటిన్యూ షూటింగ్, ఎక్సర్ సైజ్ తదితర కారణాలతో ప్రభాస్ కు మోకాలి నొప్పి రావడంతో డాక్టర్ సలహా మేరకు ఆయ‌న అమెరికాలో ఆప‌రేష‌న్ చేయించుకోనున్నాడ‌ని టాక్.  కల్కి 2898 చిత్ర షూటింగ్ డిసెంబ‌ర్ వ‌ర‌కు పూర్తి చేసి ఆ త‌ర్వాత అమెరికా వెళ్లి అక్క‌డ  న్యూయార్క్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నాడ‌ట‌.

వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్ర‌భాస్ వాటికి సంబంధించిన‌ షూటింగ్లు.. ప్రమోషన్లు ! దానికి తోడు.. తీవ్రంగా వేధిస్తున్న మోకాలి గాయంతో చాలా బాధ‌ప‌డుతున్నాడు. ఒక‌వైపు వ‌రుస ఫ్లాపులు, మ‌రోవైపు అనారోగ్య స‌మ‌స్య‌లు ఒకేసారి రావ‌డంతో ప్ర‌భాస్‌తో పాటు ఆయ‌న అభిమానులు చాలా ఫీల‌వుతున్నారు. ఏడాది పాటు  ప్ర‌భాస్ రెస్ట్ తీసుకొని ఉత్సాహంగా సినిమాలు చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుతం  ప్ర‌భాస్ చేస్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే త్వ‌ర‌లో సలార్, కల్కి చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయ‌నున్నారు. వీటి తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...