Home Film News భారీగా పెరుగుతున్న‌ మ‌హేష్ ఆస్తులు.. ఖ‌రీదైన ఇళ్ల నుంచి ప్రైవేట్ జెట్ వ‌ర‌కు..!
Film News

భారీగా పెరుగుతున్న‌ మ‌హేష్ ఆస్తులు.. ఖ‌రీదైన ఇళ్ల నుంచి ప్రైవేట్ జెట్ వ‌ర‌కు..!

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ గ‌డప తొక్కిన మ‌హేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత హీరోగా ఎదిగాడు. కె. రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ట్ చేసిన రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ బాబు.. తొలి సినిమాతోనే అంద‌ని హృద‌యాలు గెలుపుకున్నాడు. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా, ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క‌డు, పోకిరి, దూకుడు, బిజినెస్‌మేన్‌ వంటి చిత్రాలు మ‌హేష్ బాబుకు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. టాలీవుడ్ టాప్ హీరోల చెంత చేర్చాయి.

Mahesh Babu, Namrata Shirodkar's emotional note on daughter Sitara's birthday- The New Indian Express

1999 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 25కి పైగా చిత్రాల్లో న‌టించిన మ‌హేష్ బాబు.. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా, అనేక బ్రాండ్స్‌కు అంబాసిడ‌ర్‌గా, స‌మాజ సేవ‌కుడిగానూ స‌త్తా చాటుతున్నాడు. ఎటువంటి పాన్ ఇండియా ఇమేజ్ లేకుండానే టాలీవుడ్ లో హైయ్యెస్ట్ పెయిడ్ యాక్ట‌ర్ గా గుర్తింపు పొందాడు. మ‌హేష్ బాబు ఎదుగుద‌ల‌కు త‌గ్గ‌ట్లుగానే ఆయ‌న ఆస్తులు కూడా ప్ర‌తి ఏడాది భారీగా పెరుగుతున్నాయి.

మ‌హేష్ బాబు నిక‌ర విలువ‌, నెల‌వారీ ఆదాయం, అత‌ని ల‌గ్జ‌రీ లైఫ్ గురించి తెలుసుకుంటే సామాన్యుల‌కు మ‌తులుపోవాల్సిందే. హీరోగా చేసిన తొలి చిత్రం రాజ‌కుమారుడుకి మ‌హేష్ బాబు రెమ్యున‌రేష‌న్ రూ. 10 ల‌క్ష‌ల కంటే లోపే ఉంటుంది. కానీ, ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 70 కోట్ల‌కు త‌గ్గ‌కుండా పారితోషికం పుచ్చుకుంటున్నాడు. అలాగే ఐడియా సెల్యులార్, జోస్ ఆలుక్కాస్, రాయల్ స్టాగ్, మహీంద్రా ట్రాక్టర్స్, టాటా స్కై, మౌంటెన్ డ్యూ, టీవీఎస్ మోటార్ కంపెనీ మొదలైన వాటికి మ‌హేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

అతను ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయిల‌కు పైగా వసూలు చేస్తున్నాడని నివేదించబడింది. మ‌హేష్ బాబు నెల‌వారీ ఆదాయం రూ. 2 కోట్ల‌కు త‌గ్గ‌కుండా ఉంటుంద‌ని అంటున్నారు. ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. మ‌హేష్ బాబు నిక‌ర విలువ రూ. 273 కోట్లు. ఇదంతా మ‌హేష్ బాబు త‌న క‌ష్టంతో కూడ‌బెట్టుకున్న‌దే. తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ నుంచి ఆయ‌న ఒక్క రూపాయి ఆస్తి కూడా తీసుకోలేదు. కృష్ణ గారు త‌న ఆస్తుల‌ను మనవళ్లు, మనవరాళ్లకి రాశార‌ని ఇన్‌సైడ్ టాక్ ఉంది.

Mahesh Babu and Namrata : टॉलीवुड 'प्रिंस' महेश बाबू ने शादी की 18वीं सालगिरह पर ऐसे किया विश, पत्नी नम्रता भी हुईं रोमांटिक, mahesh-babu-and-namrata-shirodkar-shared-pictures ...

అయితే 2015లో మ‌హేష్ బాబు ఆస్తుల విలువ రూ. 90 కోట్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉన్న మోస్ట్‌ రిచ్చెస్ట్ హీరోల్లో మ‌హేష్ బాబు ఒక‌డిగా స‌త్తా చాటుతున్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ విలాసవంతమైన బంగ్లాలో మ‌హేష్ బాబు నివాసం ఉంటున్నాడు. ఇండోర్ పూల్, విశాలమైన గార్డెన్ ఏరియా, లాంజ్ ఏరియా, రీడింగ్ స్పేస్. ఇలా అన్ని సౌక‌ర్యాల‌తో అత్యంత విలాస‌వంతంగా ఉండే ఈ ఇంటి ఖ‌రీదు రూ. 28 కోట్లు జూబ్లీహిల్స్ లోనే మ‌హేష్ బాబు పేరిట మ‌రొక ల‌గ్జ‌రీ హౌస్ ఉంది. అలాగే బెంగళూరు, పూణే వంటి ప్రాంతాల్లో మ‌హేష్ బాబుకు సొంత‌ విల్లాలు ఉన్నాయి.

మ‌హేష్ బాబు గొప్ప కార్ల ప్రేమికుడు. అత‌ని వ‌ద్ద రూ. 2.80 కోట్లు ఖ‌రీదు చేసే లంబోర్ఘిని గల్లార్డో, రూ. 2.31 కోట్లు విలువైన రేంజ్ రోవర్ వోగ్, రూ. 2.5 కోట్లు ప‌లికే రేంజ్ రోవర్ వోగ్ ఆటోబయోగ్రఫీ, రూ.1.19 కోట్లు ఖ‌రీదు చేసే ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్, రూ. 1.30కోట్ల బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ, రూ. 84.99 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ ఇ వంటి ల‌గ్జ‌రీ కార్లు ఆయ‌న గ్యారేజ్ లో ఉన్నాయి. వీటితో పాటు రూ. 6 కోట్లు ప‌లికే వ్యానిటీ వ్యాన్ మ‌రియు ప్రైవేట్ జెట్‌ను మ‌హేష్ బాబు క‌లిగి ఉన్నాడు.

Forever Young, Mahesh Babu

మహేష్ బాబుకు సంబంధించిన అత్యంత ఖరీదైన ఆస్తులలో ఏఎంబీ సినిమాస్ ఒక‌టి. సుమారు ఐదేళ్ల క్రిత‌మే మ‌హేష్ బాబు ఏసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్ లో అత్యాధునిక హంగులతో ఏఎంబీ సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. ఇది ఇండియాలో అతిపెద్ద మల్టీప్లెక్స్ లలో ఒకటిగా నిలిచింది. అలాగే జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో మ‌హేష్ బాబు సొంతంగా ప్రొడెక్ష‌న్ హౌస్‌ను ప్రారంభించాడు. త‌న సినిమాల‌తో పాటు ఇత‌ర హీరోల సినిమాల‌ను కూడా మ‌హేష్ బాబు నిర్మిస్తుంటారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త చూసుకుంటోంది.

4 most expensive things Mahesh Babu owns in Hyderabad - The Siasat Daily – Archive

ఇటీవల ఏఎన్ రెస్టారెంట్ పేరుతో మహేష్ బాబు రెస్టారెంట్ వ్యాపారంలో అడుగుపెట్టి దూసుకుపోతున్నాడు. న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా, స‌క్సెస్ ఫుల్ వ్యాపార‌వేత్త‌గా కొన‌సాగుతూ ఆస్తుల‌ను భారీగా పెంచుకుంటున్నాడు. మ‌రోవైపు తాను సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్య‌క్ర‌మాల‌ను ఉప‌యోగిస్తూ రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయించి వారి గుండె చ‌ప్పుడు అయ్యాడు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని.. వాటిని మోడ్ర‌న్ విలేజెస్‌గా అభివృద్ధి చేస్తున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...