Home Film News R Narayana Murthy: ఆప‌కుండా స‌గం బాటిల్ లిక్క‌ర్ తాగేసిన ఆర్. నారాయ‌ణ మూర్తి.. త‌ర్వాత ఏమైందంటే..!
Film News

R Narayana Murthy: ఆప‌కుండా స‌గం బాటిల్ లిక్క‌ర్ తాగేసిన ఆర్. నారాయ‌ణ మూర్తి.. త‌ర్వాత ఏమైందంటే..!

R Narayana Murthy: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆర్. నారాయణ మూర్తి అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా సమాజంలో చైతన్యం రగిలించే విప్లవ సినిమాల్లో నటించే పవర్ ఫుల్ నటుడు ఆర్. నారాయణమూర్తి. ఎర్రసైన్యం, చీమలదండు, వీరతెలంగాణ, పోరు తెలంగాణ లాంటి సినిమాలను ఎంతో చక్కగా ప్రజలకు చేర్చారు. తన నటనతో ఎంతోమంది అభిమానం సంపాదించుకున్నారు. నిజానికి ఆర్. నారాయణ మూర్తి ఆలోచనలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. నిర్మాతగా ఎంతో ఎదిగినా.. తనకంటూ ఆస్తిని ఏర్పాటు చేసుకోలేదు. ప్రజాజీవితం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన నటించిన చాలా సినిమాల్లో పోరాటాలు, విప్లవాల సినిమాలు ఎక్కువ ఉండేవి. చివరికీ పెళ్లి కూడా చేసుకోలేదు.

రీసెంట్ గా ఆర్. నారాయణమూర్తి గురించి డైరెక్టర్ జయకుమార్ మాట్లాడుతూ.. దాసరి దంపతులు ఆర్. నారాయణమూర్తికి బంధువు అవుతారని అన్నారు. అందుకే దాసరి, ఆర్. నారాయణమూర్తి క్లోజ్ గా ఉండేవారని అన్నారు. దాసరి గారి దగ్గర పనిచేసే సాంబశివరావు నారాయణమూర్తిని రెచ్చగొట్టారని డైరెక్టర్ జయకుమార్ అన్నారు. ఏ విషయంలో ఇలా రెచ్చగొట్టడం జరిగిందనే విషయం అడగ్గా.. జయకుమార్ మాట్లాడుతూ.. ఒక రోజు సాయంత్రం సమయంలో దాసరి నారాయణ దగ్గరకు ఆర్. నారాయణమూర్తి వెళ్లారు. ఆ సమయంలో అతని దగ్గర పనిచేసే వాళ్లతో పాటు సాంబశివరావు కూడా డ్రింక్ చేస్తున్నారు.

 

ఆ టైమ్ లో నారాయణమూర్తిని చూసి ఆల్కహాల్ తాగాలని అన్నారు. కానీ తనకు మందు అలవాటు లేదని.. బలవంతం చేయొద్దని చాలా సున్నితంగా వద్దని చెప్పారు. దాంతో సాంబశివరావు అసలు నువ్వు మగాడివేనా.. మందు తాగలేవా అని రెచ్చగొట్టారు. ఆ మాట విన్న ఆర్. నారాయణమూర్తికి బాగా కోపం వచ్చి.. వెంటనే పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని ఆపకుండా సగం బాటిల్ వరకు రా ఆల్కహాల్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి అలాగే కింద పడిపోయారని డైరెక్టర్ జయకుమార్ చెప్పుకొచ్చారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...