Home Film News ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ నేరుగా OTT లోనే రిలీజ్ అవనుందా?!
Film News

ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ నేరుగా OTT లోనే రిలీజ్ అవనుందా?!

Pushpaka Vimanam to be released on Prime

విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అతని సక్సెస్ తో తమ్ముడైన ఆనంద్ దేవరకొండ కూడా సినిమాలో తన లక్ ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నాడు. తీసిన మొదటి సినిమా నటుడిగా అతనికి కాస్త గుర్తింపు తీసుకువచ్చింది. ఐతే, ఇప్పుడు ఆనంద్ నటిస్తున్న మరో సినిమా ‘పుష్పక విమానం’ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దామోదర కి ఇదే మొదటి సినిమా. ఇప్పటికే సినిమా ప్రమోషన్ లో బిజీ అవుతున్న సినిమా టీం ‘సిలకా’ అనే పాటని రిలీజ్ కూడా చేసింది. గీత్ సైని, సాన్వి మేఘన ఫీమేల్ లీడ్స్ గా నటించబోతున్న ఈ సినిమా ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అంటున్నారు.

ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరగాల్సి ఉన్న ఈ సినిమాని ఓటీటీలోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం నేరుగా అమెజాన్ ప్రైమ్ తో చర్చలు జరుపుతున్నారట. ఆనంద్ దేవరకొండ చేసిన ఇంతకు ముందు సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ కూడా ఇదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి అంతటా పాజిటివ్ స్పందనలు వచ్చాయి.

ఈ సినిమాని స్వయంగా విజయ్ సమర్పిస్తుండగా, వాళ్ళ నాన్న గోవర్ధన రావ్ దేవరకొండ విజయ్ మట్టుపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లిలతో కలిసి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...