Home Film News Adipurush: ఆదిపురుష్‌తో ప్ర‌భాస్ ఖాతాలో మరో రికార్డ్‌..ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక న‌టుడు రాఘ‌వుడే..!
Film News

Adipurush: ఆదిపురుష్‌తో ప్ర‌భాస్ ఖాతాలో మరో రికార్డ్‌..ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక న‌టుడు రాఘ‌వుడే..!

Adipurush: భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రం  రిలీజైన తొలి రోజు నుండి మిక్స్‌డ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాకి ఓవైపు నెగెటివ్ టాక్ వస్తున్నా కూడా మ‌రోవైపు క‌లెక్ష‌న్స్ ప‌రంగా దూసుకుపోతుంది. చిత్రంలో ప్రభాస్ శ్రీముడిగా,  కృతి సనన్ సీతగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా న‌టించ‌డంతో ఈ సినిమా మొదటి మూడు రోజులు టాక్‌తో సంబంధం లేకుండా ఊచకోత కోసింది. త‌ర్వాత మాత్రం క‌లెక్ష‌న్స్ డ్రాప్ అయ్యాయి. ఆదిపురుష్ చిత్రం ఇప్ప‌టికే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర  రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఆదిపురుష్ చిత్రంతో యంగ్ రెబ‌ల్ స్టార్ అరుదైన రికార్డ్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ప్ర‌భాస్ న‌టించిన  బాహుబలి, బాహుబలి 2, సాహో చిత్రాల‌ తర్వాత అమెరికాలో  ఆదిపురుష్ చిత్రం కూడా  3 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ నేప‌థ్యంలో తెలుగులో మరే ఇతర టాలీవుడ్ హీరోకి  ద‌క్క‌ని రికార్డ్ ప్ర‌భాస్‌కి ద‌క్కింది.  ప్రభాస్ తరువాత మ‌న టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్   2, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబులకి ఒక్కో మూడు మిలియన్ డాలర్ల సినిమా ఉంది. సినిమా ఎలా ఉన్నా కూడా ఆదిపురుష్ చిత్రంకి మంచి వ‌సూళ్లు వ‌స్తుండ‌డంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమాకి సంబంధించి మొదటి సారి టీజర్ విడుదల చేసినపుడే ఈ సినిమాలో  ఏదో తేడా ఉందనే టాక్ వినిపించింది. ఇక సినిమా విడుదలయ్యకా.. అసలు రామాయ‌ణాన్ని మార్చి  ఓం రౌత్.. వాల్మికీ రామాయణం తీసాడ‌ని అర్ధ‌మైంది. తనదైన పైత్యంతో రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి ఈ సినిమా తీయడంపై రామభక్తులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా చిత్ర‌ దర్శకుడి తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 7 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేశారు. హిందీ బెల్ట్ ఏరియాల్లో దాదాపు 3 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల కాగా,తొలి రోజు మల్టీప్లెక్స్ చైన్స్‌లో ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...